నమ్రత పై మహేష్ బాబు భావోద్వేగ ట్వీట్
on Jan 22, 2026

-ట్వీట్ ఎందుకు చేసాడు
-అసలు ట్వీట్ లో ఏముంది
-ఫ్యాన్స్ ఏమంటున్నారు!
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)కి లో ప్రొఫైల్ మెయింటైన్ చెయ్యడం మొదట నుంచి అలవాటు. సామాజిక సేవా పరంగా కూడా అదే లో ప్రొఫైల్ సూత్రాన్ని అవలంబిస్తూ ఎంతో మంది ప్రాణాలని కాపాడుతుంటాడు. వృత్తి పరంగా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా సినీ సామాజిక, కుటుంబ బాధ్యత విషయాల్లో తన భార్య మాజీ హీరోయిన్ నమ్రత శిరోద్కర్(Namrata shirodkar) అన్ని విధాలుగా అండగా ఉంటుంది. అంతలా మహేష్ పై నమ్రత నీడ ఉంటుంది. ఈ రోజు నమ్రత పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేష్ చేసిన ట్వీట్ ఆ ఇద్దరి మధ్య ఎంత అనుబంధం పెనవేసుకొని ఉందో తెలియచేస్తుంది.
ఎక్స్ వేదికగా నమ్రత కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తు' హ్యాపీ బర్త్ డే ఎన్ ఎస్ జి ..మన కుటుంబాన్ని ఇంతటి ప్రేమతో, గౌరవంతో ఒక్కటిగా ఉంచుతున్నందుకు నీకు ధన్యవాదాలు. అంతకంటే నేనేమి కోరుకోలేను అని నమ్రత నుదుటికి ఆప్యాయంగా ముద్దుపెడుతున్న పిక్ ని షేర్ చేసి ట్వీట్ చేసాడు. సదరు ట్వీట్ తో మహేష్ లైఫ్ లో నమ్రత బాండింగ్ ఎంత మేర ఉందో అర్ధమవుతుంది.మహేష్ అభిమానులు కూడా నమ్రత కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుండటంతో సోషల్ మీడియా కళకళ లాడుతు ఉంది.
Also read: Mana shankara varaprasad garu: నిక్కీ డీటెయిల్స్ ఇవే.. ఫాదర్ లేడు
ఇక మహేష్ ఈ సారి ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ 'వారణాసి'(Varanasi)తో ఏకంగా వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై కన్నేశాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా రాజమౌళి(SS Rajamouli)తన గత చిత్రాలని మించి హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు చూస్తుంటే కథ,కథనాలు ఊహకి అందని విధంగా ఉండబోతున్నాయని అర్ధమవుతుంది. శ్రీరాముడు గా కూడా మహేష్ మెస్మరైజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



