
గత ఏడాది 'భీష్మ' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్.. ఈ ఏడాది 'చెక్', 'రంగ్ దే', 'మ్యాస్ట్రో' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ మూడు సినిమాలూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న అప్ కమింగ్ మూవీ రిలీజ్ డేట్ వచ్చింది.
నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం'. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన ఎస్ఆర్ శేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టైటిల్ తోనే సినిమాపై ఆసక్తి కలిగేలా చేసిన డైరెక్టర్.. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేశాడు. యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 2022, ఏప్రిల్ 29న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.

సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.






