Home

»

Latest News

సమంత గారు ... ఓ మై గాడ్... ఏమి పెర్ఫార్మెన్స్!

Jun 26, 2026 11:58AM

బుల్లితెర  మీద హోస్ట్ గా ఉండే శ్రీముఖి మూవీస్ లో అడపాదడపా నటించిన విషయం తెలిసిందే. ఐతే రీసెంట్ గా రిలీజయిన "మా ఇంటి బంగారం " మూవీలో సమంతతో కలిసి శ్రీముఖి స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతేనా అద్భుతమైన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఒక నెటిజన్ ఈ మూవీ గురించి అందులో నటించిన వాళ్ళ గురించి పెట్టిన ఒక పోస్ట్ ని శ్రీముఖి తన స్టేటస్ లోకి షేర్ చేసింది.  " సమంత గారు ... ఓ మై గాడ్... ఏమి పెర్ఫార్మెన్స్!  నేను ఇలాంటి సినిమాలనే ఎక్కువగా ఇష్టపడతాను. కథే ప్రధానంగా ఉండే, పాటలు, హీరో ఎలివేషన్స్‌పై మాత్రమే ఆధారపడని సినిమాలు   ప్రత్యేకంగా అనిపిస్తాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలా నవ్వుతూ, వెలిగిపోతూ కనిపించిన మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా అనిపించింది. శ్రీముఖి  ఈ సినిమాలో చాలాబాగా  పెర్ఫార్మ్ చేశారు. స్క్రీన్‌పై నిజంగానే బుట్ట బొమ్మలా ఉన్నారు.  

ఇకపై  మరెన్నో మంచి సినిమాల్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడటానికి ఎంతో ఆనందంగా అనిపించింది.  ఇక నందిని రెడ్డి మీకు  హ్యాట్సాఫ్!  అద్భుతమైన దర్శకత్వం. ప్రతి ఎమోషన్, ప్రతి పాత్ర ఎంతో అందంగా మలిచారు. కథను మీరు చూపించిన విధానం మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని కదలనివ్వదు.  అలాగే సినిమాలో మాయాను చూడటం కూడా చాలా సంతోషంగా అనిపించింది. సమంతకు ఎంత పెద్ద అభిమాని అనేది అందరికీ తెలుసు. అలాంటి సమంతతో ఒకే సినిమాలో నటించే అవకాశం రావడంతో  కల నెరవేరినట్టే. ఆమెకు, అలాగే ప్రతి అడుగులోనూ ప్రోత్సహిస్తూ ఇలాంటి మంచి అవకాశాలను అందిపుచ్చుకునేలా అండగా నిలిచిన ఆమె తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక అభినందనలు. ఆమెకు ఇలాంటి మరెన్నో మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. "
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com