Home

»

Latest News

‘లియో’ విడుదలపై గందరగోళం.. టెన్షన్‌లో మేకర్స్‌!

Sep 22, 2023 3:32PM

ఒక సినిమా ప్రారంభించి దాని షూటింగ్‌ సక్సెస్‌ఫుల్‌ పూర్తి చేయాలంటే ఎన్నో అడ్డంకులు, అనుకోని అవాంతరాలు రావచ్చు. వాటన్నింటినీ అధిగమించి షూటింగ్‌ పూర్తి చేసిన తర్వాత అంతకు మించిన టాస్క్‌ ఆ సినిమాను రిలీజ్‌ చెయ్యడం. ఒక సినిమా రిలీజ్‌ అవ్వడం అంటే అంత మామూలు విషయం కాదు. మార్కెటింగ్‌ పరంగా, బిజినెస్‌పరంగా ఎన్నో లెక్కలు ఉంటాయి. అందర్నీ సంతృఫ్తి పరచిన తర్వాతే ఆ సినిమా రిలీజ్‌కి నోచుకుంటుంది. కొన్ని సినిమాలు ఇలాంటి విషయాల్లోనే ఆగిపోతాయి. 
ఇప్పుడు అలాంటి విచిత్రమైన పరిస్థితి దళపతి విజయ్‌ సినిమా ‘లియో’కి వచ్చింది. టాప్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘లియో’ అక్టోబర్‌ 19న విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర యూనిట్‌. డిఫరెంట్‌ పోస్టర్లను రిలీజ్‌ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. ఇదిలా ఉంటే ఒక షాకింగ్‌ న్యూస్‌ అభిమానుల్ని కలవరపరుస్తోంది. ఈ సినిమా హిందీ వెర్షన్‌ విడుదల అయోమయంలో పడిరది. ఈ సినిమా హిందీ వెర్షన్‌ అదేరోజు రిలీజ్‌ కాకపోవచ్చని తెలుస్తోంది. దీంతో బాలీవుడ్‌ వర్గాల్లో ఆందోళన మొదలైంది. హిందీ వెర్షన్‌ రిలీజ్‌కి ఓటీటీ అగ్రిమెంట్‌ అడ్డుపడుతోంది. 
హిందీలో ఏ సినిమా రిలీజ్‌ అయినా 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీ రిలీజ్‌ చేసుకోవాలనే అగ్రిమెంట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని పివిఆర్‌, ఐనాక్స్‌, సినీపోలిస్‌ వంటి సంస్థలు ఫాలో అవుతున్నాయి. ‘లియో’ విషయానికి వస్తే 4 వారాల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ చేసుకునే విధంగా అగ్రిమెంట్‌ చేశారని సమాచారం. దీంతో ఈ సినిమా హిందీ వెర్షన్‌ రిలీజ్‌ విషయంలో గందరగోళం నెలకొంది. సౌత్‌ సినిమాలకు హిందీలో మంచి మార్కెట్‌ ఉందన్న విషయం తెలిసిందే. కమల్‌హాసన్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘విక్రమ్‌’కు రూ.20 కోట్లు వచ్చినట్లు వచ్చిందట. ఆ రికార్డుని అధిగమించాలని ‘లియో’ మేకర్స్‌ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు సినిమా రిలీజ్‌ సస్పెన్స్‌లో పడిరది. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com