
-సైబరాబాద్ పీ ఎస్ కి లావణ్య త్రిపాఠి
-కారణం ఏంటి
-కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
లావణ్య త్రిపాఠి(Lavanya tripathi)..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)తో వివాహం తర్వాత మెగా కోడలు అనే టాగ్ లైన్ ని పొంది, మెగా అభిమానుల నిత్య నామస్మరణలో ఒకరిగా మారింది. తన అప్ కమింగ్ మూవీ సతీలీలావతి ఇంటర్వూస్ లో సైతం ఆమె మెగా హీరోల అప్ కమింగ్ సినిమాల విశేషాల గురించి చెప్తు ఫ్యాన్స్ లో జోష్ ని తెప్పిస్తుంది. తాజాగా లావణ్య త్రిపాఠి సైబరాబాద్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించడంతో ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. అందుకు సంబంధించిన డిటైల్స్ ఏంటో చూద్దాం.
సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఇన్ స్టాగ్రామ్(Instagram)లో లావణ్య త్రిపాఠి యాక్టీవ్ గా ఉంటుంది. 'పర్పుల్ క్రెయాన్' ఖాతా ద్వారా లావణ్య త్రిపాఠి ని ఉద్దేశిస్తూ కొంత మంది అసభ్యకర పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు. దీంతో లావణ్య త్రిపాఠీ హైదరాబాద్ లోని సైబరాబాద్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించి అసభ్యకర పోస్టులు తొలగించాలని పోలీసులని కోరారు. దీంతో పోలీసులు ఐటీ యాక్ట్ సెక్షన్ 67, BNS 78, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
also read: 90 s ఆదిత్య హాసన్ కామెంట్స్ వైరల్.. మహుబూబ్ నగర్ అంటే క్యాబ్ డ్రైవర్లునా!
ఈ విషయంపై మెగా అభిమానులతో పాటు సినీ అభిమానులు, నెటిజన్స్ స్పందిస్తు నటీనటులపై ఇక ముందు నుంచి అయినా ఎవరు కూడా ఎలాంటి వల్గర్ కామెంట్స్ చెయ్యకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.







