
కృతి సనన్( ప్రస్తుతం థియేటర్స్ లో షాహిద్ కపూర్, రష్మిక తో కలిసి 'కాక్ టేయిల్ 2 ' అనే హిందీ మూవీతో సందడి చేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన '1 ' నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన సంగతి అందరికీ తెలిసిందే. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.
అందులో ఆమె మాట్లాడుతు 'నేను హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. అందుకే టాలీవుడ్ స్టార్స్ గురించి గానీ, ఇక్కడి సినిమాల గురించి గానీ పెద్దగా అవగాహన లేదు.. మొదటిసారి మహేష్ బాబును కలిసినప్పుడు ఒక సాధారణ వ్యక్తిలా, ఇండస్ట్రీలో ఒక సీనియర్ నటుడిలా మాత్రమే చూసి చాలా నార్మల్‌గా, చిల్‌గా మాట్లాడాను. కానీ సినిమా షూటింగ్ రోజురోజుకూ ముందుకు సాగుతున్న కొద్దీ ఆయన చుట్టూ ఉన్న క్రేజ్, అభిమానుల హంగామా చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడే ఆయన అసలు సిసలైన స్టార్‌డమ్ మరియు ఫ్యాన్ బేస్ విలువ ఏమిటో తనకు అర్థమైంది. ఒకరోజు సుకుమార్ తనతో, "నువ్వు మంచి నటివి అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు, కానీ నిన్ను ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకోవడానికి మరో ముఖ్య కారణం నీకున్న అద్భుతమైన జ్ఞాపకశక్తి (మెమరీ పవర్)" అని అన్నారు తనకున్న ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ వల్లే డైలాగులను అంత త్వరగా బట్టీ పట్టి గుర్తుంచుకోగలిగానని ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చారు. '1: నేనొక్కడినే' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో భారీ విజయం సాధించలేకపోయినప్పటికీ, ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అదొక క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయిందని, మహేష్ బాబుతో వర్క్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని కృతి సనన్ ఆనందం వ్యక్తం చేశారు.
Also read: Thaman: పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతిపై థమన్ సంచలన నిర్ణయం






