Home

»

Latest News

krithi shetty: ఉప్పెన భామ కృతిశెట్టి సంచలన వ్యాఖ్యలు.. మూవీ ప్లాప్ అవుతుందని తనకి తెలుసా!

Jun 2, 2026 12:06PM

 

ఫస్ట్ మూవీ ఉప్పెనతో ప్రేక్షుకులని తన వశం చేసుకున్న భామ కృతిశెట్టి(Krithi Shetty). పెర్ఫార్మ్ పరంగా కూడా మంచి పేరు సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత బంగార్రాజు తప్ప వరుస పరాజయాలని చవి చూస్తూ వస్తుంది. ప్రీవియస్ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అదే పరిస్థితి. సదరు పరాజయలపై కొంత మంది  హీరోయిన్స్ ని బాద్యులుగా చేస్తూ .  'ఐరన్ లెగ్' అనే టాగ్ లైన్ ని ఇస్తుంటారు. 

ఈ అంశంపై రీసెంట్ గా కృతి శెట్టి మాట్లాడుతు మూవీ డిజాస్టర్ కి హీరోయిన్ ఒక్కరినే బాధ్యురాలీని చేయడం అత్యంత దారుణం, అన్యాయం. సాధారణంగా ఒక కమర్షియల్ సినిమాలో లేదా పెద్ద చిత్రాలలో హీరోయిన్‌కి ఉండే ప్రాధాన్యత ఎంత అనేది అందరికీ తెలిసిందే. చాలా వరకు సినిమాలలో హీరోయిన్‌కు ఉండేది చాలా పరిమితమైన లేదా చిన్న క్యారక్టర్ మాత్రమే. కేవలం కొన్ని పాటలు, కొన్ని సన్నివేశాలకే వారు పరిమితం అవుతుంటారు. ఒక ప్రాజెక్ట్‌ని ఎలా తీర్చిదిద్దాలి, అసలు కథను ఏ విధంగా ముందుకు నడిపించాలి అనే కీలకమైన విషయాల్లో హీరోయిన్లకి  కనీసం మాట్లాడే హక్కు కానీ, నిర్ణయాలు తీసుకునే అధికారం కానీ ఉండదు. కేవలం తమ పరిధిలో ఉన్న క్యారక్టర్ కి   నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి మాత్రమే కష్టపడుతుంటాం. అలాంటప్పుడు, మొత్తం సినిమా రిజల్ట్‌ని వారి ఖాతాలో వేస్తూ, కేవలం వారి వల్లే సినిమా ఫ్లాప్ అయిందంటూ 'ఐరన్ లెగ్' అనే ముద్ర వేయడం ఎంతవరకు సమంజసం. ఈ రకమైన నెగిటివిటీ నటీనటులపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

Also read: Peddi: పెద్ది ప్రధాన హైలెట్స్ ఇవే.. కానీ ఆ ఒక్కటి తప్ప 

చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫార్ములా అనేది ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. అసలు ఒక 100% విజయవంతమైన సినిమాని ఎలా తీయాలో ఇండస్ట్రీలో ఎవరికీ ముందే తెలియదు  ఒకవేళ ముందే తెలిస్తే అసలు ఫ్లాప్ సినిమాలే రావు. ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతోనే ఎంతో కష్టపడతారని చెప్పుకొచ్చింది. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com