నువ్వా? నేనా?.. కిష్కింధపురి, మిరాయ్.. ఈ రెండు సినిమాల్లో ఏది హిట్?
on Sep 12, 2025
ఈ వారం ఇద్దరు యంగ్ హీరోలు పోటీ పడుతున్నారు. సెప్టెంబర్ 12న బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘కిష్కింధపురి’, తేజ సజ్జ హీరోగా రూపొందిన ‘మిరాయ్’ చిత్రాలు విడుదలయ్యాయి. కిష్కింధపురికి కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు కాగా, మిరాయ్ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని రూపొందించారు. బెల్లంకొండ శ్రీనివాస్, తేజ సజ్జా ఇద్దరూ తమ సినిమాలపై పూర్తి కాన్ఫిడెన్స్ ఉన్నారు. దీంతో వీరి మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా మారింది. రిలీజ్‌కి ముందు రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగాయి. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్ కావడంతో రెండూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం ఉందని ట్రేడ్‌వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
మిరాయ్ చిత్రంలో మంచు మనోజ్ మరో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాను అశోకుడు, 9 పుస్తకాలు నేపథ్యంలో కొంత మైథలాజికల్ టచ్‌తో రూపొందించారు. కిష్కింధపురి విషయానికి వస్తే.. షైన్ స్క్రీన్స్ పతాకంపై థ్రిల్లర్ జానర్‌లో నిర్మించారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీమియర్స్ ఒకరోజు ముందే పడ్డాయి. ఇప్పటివరకు వస్తున్న రిపోర్టుల ప్రకారం థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన కిష్కింధపురి ప్రేక్షకుల్ని బాగానే భయపెట్టిందని తెలుస్తోంది. కథ, కథనం బాగానే ఉందని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయని చెబుతున్నారు. మిరాయ్ విషయానికి వస్తే.. మైథలాజికల్ టచ్‌తో ఒక విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారని అప్రిషియేట్ చేస్తున్నారు. కథ బాగున్నప్పటికీ కథనంలో కొన్ని లోపాలు కనిపించాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఏది విన్నర్‌గా నిలుస్తుంది అని చెప్పడానికి మరి కొన్నిరోజులు పట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ రెండూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు కావడంతో బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టించే ఛాన్స్ ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



