Home

»

Latest News

తిరుపతి లడ్డు తయారిలో రోజా కి 15 % వాటా అంట! మిగతా వారికి ఎంతో తెలుసా!

Sep 24, 2024 5:34PM

నవ్వుల కామెడీ షో  జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయ్యి ఆ తర్వాత సినిమాల్లో కూడా తనదైన కామెడీ తో అశేష అభిమానులని సంపాదించుకున్నాడు కిరాక్ ఆర్ఫీ(kiraak rp)గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పలు సమస్యలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ వచ్చే ఆర్ఫీ  తిరుపతి లడ్డు విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.

 తిరుపతి లడ్డులో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఇప్పుడు షాక్ లో ఉన్నారు. ఈ విషయంపై ఒక డిబేట్ లో పాల్గొన్న ఆర్ఫీ పలు సంచలన విషయాలని వెల్లడి చేసాడు.నూటికి నూరు శాతం తిరుపతి లడ్డు లో జంతువుల కొవ్వు తో తయారు చేసిన నూనె ని వాడి  కోట్ల రూపాయల స్వామి వారి డబ్బుని దోచేశారు. అలా దోచేసిన డబ్బుల్లో ప్రముఖ హీరోయిన్,గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన  రోజా(roja)కి పదిహేను శాతం వాటా వెళ్ళింది. 

ఇది పూర్తిగా నిజమని, కావాలంటే రోజా డిబేట్ కి రావాలని  ఆర్ పి సవాలు విసురుతున్నాడు. అదే విధంగా  కొంత మంది ప్రభుత్వ పెద్దలతో కలిసి శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్ర చందనాన్ని అక్రంగా రవాణా చేసి కూడా కోట్ల రూపాయలని సంపాధించిందని కూడా ఆర్పీ చెప్పుకొచ్చాడు.మరి రోజా ఈ ఆరోపణల మీద ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com