
సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులని సంపాదించుకుని, నిత్యం డిజిటల్ ప్రపంచంలో నవ్వులు చిందించే కేరళకి చెందిన ప్రముఖ డిజిటల్ క్రియేటర్ అఖిల్, ఆయన భార్య జెన్సీ సోషల్ మీడియాలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తమ జీవితంలోని ప్రతీ విషయాన్ని, సంతోషాన్ని యూట్యూబ్ వీడియోల ద్వారా పంచుకుంటూ దాదాపు 5,00,000 మందికి పైగా సబ్‌స్క్రైబర్ల ప్రేమను గెలుచుకున్నారు. వీరిద్దరూ జంటగా చేసే వినోదాత్మక వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చేవి. నెటిజన్లు కూడా వీరిని ఎంతో ఆదర్శవంతమైన దంపతులుగా చూసేవారు. కానీ, కెమెరా ముందు కనిపించే ప్రతీ నవ్వు వెనుకా ఒక చేదు నిజం దాగి ఉంటుందని ఈ దంపతుల జీవితం నిరూపించింది. అనుమానం లేని ఆ సంతోషకరమైన జీవితంలోకి ఒక సాధారణ బస్సు ప్రయాణం ఊహించని పెద్ద తుఫానును మోసుకొచ్చింది.
అఖిల్ భార్య ఇటీవల ఒక బస్సు కండక్టర్ తో పారిపోయింది. ఎందుకిలా చేసిందో మొదట్లో అర్థం కాలేదు.. ఆ తర్వాత అందరూ ఆమెను దూషించడం మొదలుపెట్టారు. చివరికి ఇటీవల అఖిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె దారి ఆమె చూసుకుంది. ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అఖిల్ చెప్పాడు. ఇటీవల కాలంలో అఖిల్ ఆమె మీద దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమెను చీటికిమాటికి వేధించేవాడు. ఇది తట్టుకోలేక ఆమె కండక్టర్ తో చనువు పెంచుకుంది. అతడు చూపించే ప్రేమ ఆమెను మరో లోకంలోకి తీసుకెళ్లింది. అందువల్లే అతనితో జీవితాన్ని పంచుకోవాలని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు రికార్డయ్యాయి. దీంతో ఆమె ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయిందో తేలడంతో ఇప్పుడు కేరళలో ఆ యూట్యూబర్ గురించి నెగిటివ్ చర్చ మొదలైంది.
Also read: వాళ్ళకి మాత్రం షాక్: ఓటీటీలోకి జననాయకుడు.. డేట్ ఇదే
భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ముఖ్యంగా ఈగోలను వదిలిపెట్టాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఎన్ని గొడవలు అయినా సరే బాధ్యతాయుతంగా ఉండాలి. అప్పుడే ఆ సంసారం బాగుంటుంది. లేకపోతే ఇలా కొద్దిరోజులకే చీలిపోతుంది. యూట్యూబర్ వ్యవహారం చాలా మందికి ఒక పాఠం లాంటిది. అందువల్లే కొత్తగా పెళ్లయిన వారు.. గతంలో వివాహమైన వారు ఈ ఉదంతాన్ని ఒక పాఠం లాగా తీసుకోవాలి.
Kerala You Tuber, Akhil, Jensi






