Home

»

Latest News

రోడ్డు ప్ర‌మాదంలో క‌త్తి మ‌హేశ్ త‌ల‌కు బ‌ల‌మైన గాయాలు.. నెల్లూరు హాస్పిట‌ల్‌లో చికిత్స‌

Jun 26, 2021

 

న‌టుడు, ద‌ర్శ‌కుడు, సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేశ్ రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. నెల్లూరులో చంద్ర‌శేఖ‌ర‌పురం హైవేపై ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. లేటెస్ట్ రిపోర్టుల ప్ర‌కారం హైవేలో ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు ఓ ట్ర‌క్కును ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న త‌ల‌కు బ‌ల‌మైన గాయాలు కాగా కారు నుజ్జు నుజ్జు అయ్యింది. చికిత్స నిమిత్తం వెంట‌నే ఆయ‌న‌ను నెల్లూరు మెడికేర్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. 

ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు స‌న్నిహితులు తెలిపారు. ఆయ‌న గాయాల తీవ్ర‌త గురించి తెలియాల్సి వ‌చ్చింది. ఇదివ‌ర‌కు ఆయ‌న‌కు కొవిడ్ పాజిటివ్ అన్న‌ట్లు వార్త‌లు రాగా, వాటిని ఆయ‌న ఖండించారు. తాను కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాన‌నీ, త‌న‌కు నెగ‌టివ్ అని వ‌చ్చిన‌ట్లు ఓ వీడియో ద్వారా వెల్ల‌డించారు.

మీడియా వ్య‌క్తిగా, విమ‌ర్శ‌కునిగా, ద‌ర్శ‌కునిగా, న‌టునిగా క‌త్తి మ‌హేశ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి సుప‌రిచితుడు. జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ బాస్ సీజ‌న్ 1లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాక‌, ఆయ‌న పాపుల‌ర్ అయ్యారు. మార్నింగ్ రాగ మ్యూజిక్ వీడియోల‌తో సోష‌ల్ మీడియా ఫాలోయ‌ర్స్‌ను ఆయ‌న ఆనందింప‌జేస్తూ వ‌స్తున్నారు.

సామాజిక స‌మ‌స్య‌లు, స‌మ‌కాలీన అంశాల‌పై ఆయ‌న చేసే వ్యాఖ్య‌లు ప‌లుమార్లు వివాదాల‌కు దారితీశాయి. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఆయ‌న చేసిన‌ విమ‌ర్శ‌లు దుమారాన్ని సృష్టించాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com