Home

»

Latest News

గేమ్ ఛేంజర్ ఒరిజినల్ స్టోరీ ఇదే: కార్తీక్ సుబ్బరాజ్ సంచలన నిజాలు:షాక్ లో ఫ్యాన్స్!

Oct 28, 2026 3:57PM

 

గేమ్ చేంజర్.. మెగా ఫ్యాన్స్ పాలిట స్వీట్ డిజప్పాయింట్ మూవీ.. స్వీట్ డిజప్పాయింట్ ఎందుకంటే రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో సూపర్ గా చేసాడు. ముఖ్యంగా మాటతడబడుతు స్వచ్ఛమైన విలువలతో పొలిటికల్ పార్టీ స్థాపించే నాయకుడిగా మెస్మరైజ్ చేసి పడేసాడు. కానీ కథనం, డైరెక్షన్ ఓల్డ్ ఫార్మేట్ లో జరగడంతో గేమ్ చేంజర్  ఫెయిల్యూర్ గా నిలిచింది. కథని ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అందించాడు. 


తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ గేమ్ చేంజర్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'మొదట నేను రాసుకున్న కథ పూర్తిగా 'రా అండ్ రియలిస్టిక్' పంథాలో సాగుతుంది. హిందీలో విమర్శకుల ప్రశంసలు పొందిన 'న్యూటన్' సినిమా తరహాలో ఒక ఎన్నికల అధికారి మరియు ఒక సాధారణ ఐఏఎస్ ఆఫీసర్ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి చేసే ప్రయత్నాల చుట్టూ కథ  లైన్ తిరుగుతుంది. తమిళ నేటివిటీకి తగినట్లుగా మదురై బ్యాక్‌డ్రాప్‌లో కొంత గ్యాంగ్‌స్టర్ డ్రామాని జోడించి అత్యంత సహజంగా రాసుకున్నాను. ఆ సమయంలో నా డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాన్' సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల పూర్తి స్క్రీన్‌ప్లేని అందించలేకపోయాను. కేవలం ఒక వన్-లైనర్ మూల కథను మాత్రమే శంకర్‌ సార్ కి ఇవ్వడం జరిగింది. అయితే చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ ఇమేజ్, వందల కోట్ల భారీ బడ్జెట్ తోడయ్యేసరికి కథ తాలూకు స్వరూపమే పూర్తిగా మారిపోయి నేను ఊహించిన రియలిస్టిక్ డ్రామా కాస్తా, శంకర్ మార్క్ భారీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపాంతరం చెందింది. 

 

ఇది కూడా చదవండి: బయటపడిన అసలు నిజం: రామాయణలో బ్రహ్మ ఏఐని వాడారు..ప్రూఫ్ ఇదిగో!  

 

 

కథలో చాలా మంది రైటర్లు భాగం కావడం వల్ల స్క్రీన్‌ప్లేలో భారీ మార్పులు జరిగాయి.  సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో, ప్రేక్షకులు ఎందుకు కనెక్ట్ కాలేకపోయారో ఎవరూ ముందే అంచనా వేయలేరు. ఏది ఏమైనప్పటికీ శంకర్ లాంటి లెజెండరీ డైరెక్టర్ నా కథని  ఎంచుకుని సినిమాగా మలచడం ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.  

 

 

[Karthik Subbaraj About Game Changer Original Story, Karthik Subbaraj About Game Changer, Karthik Subbaraj, Ram Charan, Director Shankar, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com