కాంతార బాక్సాఫీస్ జాతర.. రెండు వారాల్లో ఎన్ని వందల కోట్లంటే..?
on Oct 17, 2025
.webp)
'కాంతార'కి ప్రీక్వెల్ గా రూపొందిన 'కాంతార చాప్టర్ 1' దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. రెండు వారాల్లోనే ఈ చిత్రం రూ.700 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం విశేషం. (Kantara Chapter 1)
'కాంతార చాప్టర్ 1' మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్ల గ్రాస్ రాబట్టింది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మొదటి వారం రూ.509 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. రెండు వారాలు పూర్తయ్యే సరికి రూ.717 కోట్ల గ్రాస్ సాధించింది. పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడం, మూడో వీకెండ్ కి దీపావళి హాలిడే తోడు కావడంతో.. ఈ మూడు రోజులు మంచి వసూళ్ళతో జోరు చూపించే అవకాశముంది. దాంతో ఈ చిత్రం రూ.800 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ 'కాంతార చాప్టర్ 1' మంచి వసూళ్ళతో సత్తా చాటుతోంది. రెండు వారాల్లో రూ.105 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు వారంలోనూ ఇదే జోరు కొనసాగించే ఛాన్స్ ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



