Kalamkaval Movie Review: కలంకావల్ మూవీ రివ్యూ
on Jan 22, 2026

మూవీ : కలంకావల్
నటీనటులు: మమ్ముట్టి, వినాయగన్, గిబిన్ గోపినాథ్, గాయత్రీ అరుణ్, రజిషా విజయన్, శృతి రామచంద్రన్ తదితరులు
ఎడిటింగ్: ప్రవీణ్ ప్రభాకర్
సినిమాటోగ్రఫీ: ఫైజల్ అలీ
మ్యూజిక్: ముజీబ్ మజీద్
దర్శకత్వం: జితిన్ కె జోష్
నిర్మాత : మమ్ముట్టి
ఓటిటి : సోని లివ్
కథ:
తమిళనాడులోని ఒక ఊర్లో ఒక మహిళ మిస్సింగ్ అవుతుంది. దాంతో ఆ ఊర్లో ఉన్న రెండు వర్గాల మధ్య గొడవ అవుతుంది. దాంతో క్రైమ్ బ్రాంచ్ కి చెందిన స్పెషల్ ఆఫీసర్ గా జయకృష్ణ (వినాయగన్) ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే భాద్యతలు తీసుకుంటాడు. విమల అనే ఆ మహిళ కేసును ఛేదించడం మొదలుపెట్టిన జయకృష్ణకి, చాలా కాలం నుంచి చాలామంది ఆడవాళ్ళు కనిపించకుండాపోయారనే విషయం అర్థమవుతుంది. ఆ మహిళలంతా ప్రేమించిన వారితో ఊరొదిలి వెళ్లిపోయారని తెలుసుకుని జయకృష్ణ ఆశ్చర్యపోతాడు. కనిపించకుండా పోయినవారిలో చాలామంది విడాకులు తీసుకున్నవారు, భర్తను కోల్పోయినవారేనని గ్రహిస్తాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయకపోవడానికి ఇదే ప్రధానమైన కారణమనే విషయం అతనికి అర్థమవుతుంది. మిస్ అయిన ఆడవాళ్ళంతా హత్యకి గురికావడంతో జయకృష్ణకి ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది ఆడవాళ్ళు గుండెపోటు వలన చనిపోయారని, మరికొంతమంది విషప్రయోగం వలన చనిపోయారని తెలిసి జయకృష్ణ ఆలోచనలో పడతాడు. ఒక వైపు నుంచి జయకృష్ణ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగా.. మరోవైపు ఆడవాళ్ళు మిస్ అవుతుంటారు. అయితే ఆడవాళ్ళని చంపేదెవరు? ఆ కిల్లర్ ని జయకృష్ణ పట్టుకుంటాడా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
ప్రతీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాకి ప్రధాన బలం స్క్రీన్ ప్లే.. ఒక క్రైమ్ ని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ ని దర్శకుడు ఎంత బలంగా చూపిస్తాడో.. అంతే ఓపికతో చివరి వరకు ఆడియన్ కనెక్ట్ అయి చూస్తాడు. అది మిస్ అయిందంటే ఆడియన్ స్కిప్ చేసేస్తాడు. అయితే ఈ సినిమాలో దర్శకుడు జితిన్ కె జోష్ తన మార్క్ ని చాటుకున్నాడు. చివరి వరకు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేని ఆడియన్ కి అందించాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా క్లీన్ అండ్ వర్త్ థ్రిల్లర్ ని ఆడియన్ కి అందించాడు. కథ సింపుల్.. పెద్దగా ఫైట్లు లేవు.. పాటలు అంతగా లేవు.. కానీ ఓ సైకో కిల్లర్ పాత్రని అంత జాగ్రత్తగా క్లీన్ గా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలున్న ఈ కలంకావల్(Kalamkaval) చివరి వరకు ఎంగేజింగ్ గా సాగింది. పోలీస్ ఆపీసర్ జయకృష్ణ , స్టాన్ లీ ల మధ్య సాగే సీన్లు ఆకట్టుకుంటాయి. అయితే భర్తలేని ఆడవారిని టార్గెట్ చేస్తూ కిల్లర్ చేసే హత్యలు కాస్త భయాన్ని కలిగిస్తాయి. ఫస్టాఫ్ రేసీగా సాగుతుంది. మమ్ముట్టి పర్ఫామెన్స్ కట్టి పడేస్తుంది. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. అయితే సెకెంఢాఫ్ కాస్త స్లో అవుతుంది. మళ్ళీ క్లైమాక్స్ బాగుంటుంది. ఈ సినిమాకి ప్రధాన బలం స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, బిజిఎమ్.. ఈ మూడు సినిమాని ఆడియన్స్ కి దగ్గర చేయడంలో పోటీపడ్డాయి.
చిన్న కథ సింపుల్ గా అలా వెళుతూ ఉంటుంది. అయితే ఈ సినిమాని ఫ్యామిలీతో చూడకపోవడమే బెటర్. ఎందుకంటే ఆడవాళ్ళని టార్గెట్ చేస్తూ ఒక సైకో కిల్లర్ చంపడం కాస్త భయంలరంగా ఉంటుంది. అందుకే ఒంటరిగా చూస్తే బెటర్. అయితే దర్శకుడు అడల్ట్ సీన్ల దగ్గర కాస్త జాగ్రత్త వహించాడు. స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయకుండా సింపుల్ గా డైలాగులతో తేల్చేశాడు. అది ఒకరకంగా మంచిదే లేదంటే ఇది కంప్లీట్ అడల్ట్ రిలేటెడ్ సినిమా అయ్యేది. ఇక ఇదొక్కటి మినహాయిస్తే సినిమా అంతా బాగుంటుంది. ఫైజల్ అలీ సినిమాటోగ్రఫీ బాగుంది. ముజీబ్ మజీద్ బిజిఎమ్ ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ ప్రభాకర్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
జయకృష్ణగా వినాయగన్, విలన్ గా మమ్ముట్టి సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. మిగిలిన వారంతా తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్ గా : సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా ఫీస్ట్. కామన్ ఆడియన్స్ ఓసారి ట్రై చేయోచ్చు.
రేటింగ్: 2.75 / 5
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



