Home

»

Latest News

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్రెండ్‌షిప్ చెడిపోయిందా?

May 23, 2026 5:57PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి బాండింగ్ ఈనాటిది కాదు, రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా కంటే ముందు నుంచే వీరి మధ్య బలమైన అనుబంధం ఉంది. ఆ స్నేహమే వెండితెరపై భీమ్, రామ్ పాత్రల్లో అంత అద్భుతంగా పండి, ఏకంగా ఆస్కార్ వేదిక వరకు తెలుగు సినిమా ఖ్యాతిని తీసుకెళ్లింది.

అయితే, మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి ఎందరో ప్రముఖులు ఎన్టీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. కానీ, అందరి కళ్లు వెతికింది మాత్రం చరణ్ పోస్ట్ కోసమే. చరణ్ నుండి ఎలాంటి అధికారిక శుభాకాంక్షల పోస్ట్ రాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నిజానికి, ఈ ఇద్దరు స్టార్ల మధ్య గ్యాప్ వచ్చిందా అనే రూమర్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గత రెండేళ్లుగా ఎన్టీఆర్ పుట్టినరోజుకు రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పడం లేదు. అదే విధంగా, ఈ ఏడాది మార్చిలో జరిగిన రామ్ చరణ్ బర్త్‌డేకి కూడా తారక్ నుండి ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్ కనిపించలేదు.

ఈ సోషల్ మీడియా యాక్టివిటీని చూసి నెటిజన్లు వీరి బాండింగ్‌లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందా అని ఆరా తీస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో ఎంతో ఆప్యాయంగా ఉన్న ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు దూరం పెరిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఈ రూమర్లపై సినీ సర్కిల్స్, వీరిద్దరికీ అత్యంత సన్నిహితంగా ఉండే వారు భిన్నంగా స్పందిస్తున్నారు. కేవలం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే పోస్టులను బట్టి.. ఇద్దరి స్నేహాన్ని అంచనా వేయడం, ఫ్రెండ్‌షిప్ చెడిపోయిందని డిసైడ్ కావడం కరెక్ట్ కాదని వారు కొట్టిపారేస్తున్నారు.

హీరోలు వ్యక్తిగతంగా ఫోన్ కాల్స్ ద్వారా లేదా నేరుగా కలుసుకుని శుభాకాంక్షలు చెప్పుకునే అవకాశం ఉంటుందని, ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. పైగా బర్త్ డేల టైంలో తాము నేరుగా కలుసుకొని సెలెబ్రేట్ చేసుకుంటామని 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ సమయంలో ఆ హీరోలు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో విష్ చేసుకుంటేనే ఫ్రెండ్‌షిప్ ఉందని అనుకోవడం అవివేకమని ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com