
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ 'డ్రాగన్'. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి అత్యంత కీలకమైన షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం ప్రొడక్షన్ డిజైనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఏకంగా యూరప్ దేశాలలోని వీధులు, పురాతన నిర్మాణాలను కళ్ళకు కట్టినట్లుగా తలపించేలా ఒక భారీ సెట్‌ను నిర్మించడం విశేషం.
విదేశాలకు వెళ్లి షూటింగ్ చేయడం కంటే మనదేశంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో విజువల్ వండర్‌ని సృష్టించాలనే లక్ష్యంతో ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన ఈ యూరప్ స్టైల్ వింటేజ్ సెట్‌లో ఎన్టీఆర్‌పై భారీ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేసి చిత్రీకరిస్తున్నారు. సినిమా కథనంలో అత్యంత కీలకమైన మలుపు తిప్పే సన్నివేశాలుగా ఇవి నిలవనున్నాయని సమాచారం.
విజువల్స్ పరంగా హాలీవుడ్ స్థాయి అనుభూతిని అందించేందుకు సాంకేతిక బృందం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. ఈ యాక్షన్ బ్లాక్స్ వెండితెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు నిజంగానే యూరప్‌లో ఉన్నారా అనేంతగా ఆశ్చర్యపోయేలా ప్రశాంత్ నీల్ డిజైన్ చేస్తున్నారు.
సాధారణంగానే ప్రశాంత్ నీల్ చిత్రాల్లో యాక్షన్ సన్నివేశాలు ఏ స్థాయి మాస్ ఎలివేషన్లను కలిగి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నీల్, ఇప్పుడు 'డ్రాగన్' మూవీ ద్వారా తన మార్క్ ఎలివేషన్స్‌ని, ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌కి తగినట్లుగా సరికొత్తగా మలుస్తున్నారు.
ఎన్టీఆర్ రా పవర్, ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ కలసి వెండితెరపై మైండ్ బ్లోయింగ్ మ్యాజిక్ క్రియేట్ చేయబోతుండటంతో ట్రేడ్ వర్గాల్లోను, ప్రేక్షక లోకంలోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ బజ్ నెలకొంది.
ఎన్టీఆర్ సరికొత్త అవతారంలో కనిపించనున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Jr NTR, Prashanth Neel, Dragon Shoot, Europe set





.webp)
