Home

»

Latest News

బిగ్ బాస్ 4: వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లో ఎంట‌రైన జ‌బ‌ర్ద‌స్త్ అవినాష్‌!

Sep 17, 2020

 

గ్రాండ్‌గా లాంచ్ అయిన బిగ్ బాస్ 4 మునుప‌టి మూడు సీజ‌న్ల లాంచ్ టీవీ రేటింగ్‌ను దాటి, స‌రికొత్త రికార్డును సృష్టించింది. 4వ సీజ‌న్ లాంచ్ ఎపిసోడ్‌కు అత్య‌ధికంగా 18.5 రేటింగ్ వ‌చ్చిన‌ట్లు స్టార్ మా యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. మొత్తం 4.5 కోట్ల మంది ఆ ఎపిసోడ్‌ను వీక్షించారంట‌. అయితే జోష్ విష‌యంలో మునుప‌టి సీజ‌న్ల కంటే ఈ సీజ‌న్ వెన‌క‌ప‌డింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతూ వ‌స్తోంది. కంటెస్టెంట్ల‌లో వీక్ష‌కుల్ని ఆక‌ట్టుకొనే సెల‌బ్రిటీలు త‌క్కువ మంది ఉండ‌ట‌మే దీనికి కార‌ణం.

ఆ లోటును భ‌ర్తీ చేయ‌డానికి క‌మెడియ‌న్ల‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నిర్వాహ‌కులు తీసుకొస్తున్నారు. తొలివారం డైరెక్ట‌ర్ సూర్య‌కిర‌ణ్ ఎలిమినేట్ అయి వెళ్ల‌గానే 'ఈ రోజుల్లో' మూవీ క‌మెడియ‌న్ సాయికుమార్ పంప‌న బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. అయితే అత‌ను హౌస్‌లో జోష్ నింప‌లేక‌పోతున్నాడు. ప్ర‌స్తుతం ఫోక‌స్ అంతా మోనాల్‌, అభిజీత్‌, అఖిల్ సార్థ‌క్‌ల ల‌వ్ ట్ర‌యాంగిల్ మీదే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

తాజాగా మ‌రో క‌మెడియ‌న్ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. అత‌ను జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ ద్వారా పాపుల‌ర్ అయిన అవినాష్‌. నిజానికి బిగ్ బాస్ 4 సీజ‌న్‌లో కంటెస్టెంట్‌గా మొద‌ట్నుంచీ అవినాష్ పేరు వినిపిస్తూ వ‌చ్చింది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా అత‌డిని హౌస్‌లోకి పంపి, వీక్ష‌కుల‌కు వినోదాన్ని క‌లిగించాల‌ని నిర్వాహ‌కులు సంక‌ల్పించారు. అవినాష్ ఏ మేర‌కు హౌస్‌లో వినోదాన్ని పంచుతాడో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com