Home

»

Latest News

Directors: డైరెక్టర్ల బ్రాండ్ పవర్.. హీరోల కంటే వాళ్ళకే క్రేజ్

Jun 15, 2026 4:54PM

 


భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు సినిమా అంటే కేవలం హీరోల ముఖచిత్రం మాత్రమే చూసేవారు. కానీ నేడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వాలన్నా, వందల కోట్ల వసూళ్లు రావాలన్నా కేవలం స్టార్ హీరోలు ఉంటే సరిపోదు, ఆ కథను నడిపించే దర్శకుడి బ్రాండ్ వాల్యూ అత్యంత కీలకంగా మారింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రస్తుతం ఇండియన్ సినిమాలో క్రేజీ కాంబినేషన్లకి  బలమైన స్క్రీన్ ప్లే తోడైనప్పుడే అద్భుతాలు సృష్టిస్తున్నారు. కొందరు స్టార్ దర్శకులు అయితే కేవలం తమ పేరుతోనే థియేటర్లకి ప్రేక్షకులని రప్పించే స్థాయికి ఎదిగారు. ఈ రోజుల్లో హీరోల మార్కెట్ పరిధిని దాటి సరిహద్దులు దాటించే శక్తి దర్శకుల బ్రాండ్ పవర్‌కే సొంతమైంది.

ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచే పేరు ఎస్ఎస్ రాజమౌళి. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి గ్లోబల్ హిట్స్‌తో భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి, ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడిగా రికార్డు సృష్టించారు. 200 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఆయన నెట్ వర్త్ దాదాపు 158 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. రాజమౌళి సినిమా వస్తోంది అంటే చాలు, అందులో హీరో ఎవరైనా సరే బాక్సాఫీస్ వద్ద కనీసం 1000 కోట్ల వసూళ్లు గ్యారెంటీ అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఏర్పడింది.

మరోవైపు వినూత్న కథాంశాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగా సరికొత్త రికార్డులని క్రియేట్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' చిత్రాలతో తన మార్క్ చూపించిన ఆయన, 'యానిమల్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించారు. కేవలం మూడు సినిమాలతోనే సందీప్ వంగా తన పారితోషికాన్ని ఏకంగా 100 కోట్ల రూపాయలకు పెంచేసినట్లు తెలుస్తోంది. ఇందులో లాభాల్లో వాటా కూడా ఉండటం విశేషం. 

టాలీవుడ్ లో లెక్కల మాస్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ కూడా ఈ రేసులో దూసుకుపోతున్నారు. 'ఆర్య' సినిమా నుండి 'పుష్ప' వరకు ఆయన ప్రయాణం అద్భుతం. ముఖ్యంగా 'పుష్ప: ది రైజ్' పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఈ క్రేజ్ తో సుకుమార్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు 75 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన నెట్ వర్త్ 20 కోట్ల నుండి 40 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అంచనా. కమర్షియల్ ఎలిమెంట్స్ కి  మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే జోడించడంలో సుకుమార్ ది ప్రత్యేక శైలి.

Also read: Aamir khan: అమీర్ కి అందులో మంచి టేస్ట్ ఉంది.. మాజీ భార్య ముందే కాజోల్ షాకింగ్ కామెంట్స్ 


ఇక కోలీవుడ్ లో లోకేష్ కనగరాజ్, బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరాణీ, సంజయ్ లీలా భన్సాలీ, అట్లీ వంటి దర్శకులు కూడా హీరోలతో సమానంగా క్రేజ్, మార్కెట్ ని  సొంతం చేసుకున్నారు. 'కేజీఎఫ్' సిరీస్ తో ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు 100 కోట్ల క్లబ్ లో చేరగా, 'జవాన్' తో అట్లీ 60 కోట్ల పారితోషికం అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ దర్శకులుగా మారారు. రాజ్ కుమార్ హిరాణీ 80 కోట్ల పారితోషికంతో 1305 కోట్ల భారీ నికర ఆస్తిని కలిగి ఉన్నారు. ఈ గణాంకాలన్నీ చూస్తుంటే భారతీయ సినిమాలో ఇప్పుడు హీరోల కంటే డైరెక్టర్ల బ్రాండ్ వాల్యూనే బాక్సాఫీస్ వద్ద అసలైన గేమ్ ఛేంజర్ గా మారిందని స్పష్టమవుతోంది.

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com