అల్లు అర్జున్ కి అరుదైన గౌరవం.. తగ్గేదేలే!
on Jul 18, 2022
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళవుతున్న సందర్భంగా 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్'(ఎఫ్ఐఏ) అమెరికాలో భారీ 'ఇండియా డే పరేడ్' నిర్వహిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి బన్నీకి ప్రత్యేక ఆహ్వానం అందింది.
ఆగష్టు 21న న్యూయార్క్ లో ప్రపంచంలోనే అతి పెద్దదైన 'ఇండియా డే పరేడ్'ను నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ హాజరవుతున్నట్లు ఎఫ్ఐఏ తెలిపింది. అంతేకాదు ఈ పరేడ్ ద్వారా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక వేడుకకు బన్నీకి ఆహ్వానం రావడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, 'పుష్ప-పార్ట్ 1'తో బన్నీ నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక 'పుష్ప-పార్ట్ 2' వస్తే బన్నీ క్రేజ్ ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.
Also Read