Home

»

Latest News

హృతిక్‌ బర్త్ డే సర్ ప్రైజ్.. అశ్వద్ధామ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది!

Nov 9, 2023 10:54AM

హృతిక్‌ శౌర్య, వరలక్ష్మీ శరతకుమార్‌ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'అశ్వద్ధామ’. 'హతః అక్షర’ అనేది ఉపశీర్షిక. చంద్ర శేఖర్‌ ఆజాద్‌ పాటిబండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్లిక్‌నైన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. హీరో పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్రం బృందం తాజాగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేసింది. హృతిక్‌ శౌర్య 'ఓటు’ చిత్రంతో హీరోగా కెరీర్‌ ప్రారంభించాడు. అందులో సాఫ్ట్‌ కుర్రాడిగా కనిపించిన ఆయన ఈ చిత్రంలో పక్కా కమర్షియల్‌ హీరోగా కనిపించనున్నాడు. 

ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, "రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. పక్కా కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కుతోంది. వరలక్ష్మీ శరతకుమార్‌ పాత్ర గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా ఉంటుంది. నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో ఒక సర్‌ప్రైజ్‌ ఆర్టిస్ట్‌ కనిపిస్తారు. హీరోకి మంచి చిత్రం అవుతుంది. కమర్షియల్‌ హీరోగా ఎలివేట్‌ అవుతాడు. ఆయన చేసిన యాక్షన ఎపిసోడ్స్‌కి టీమ్‌ అంతా ఫిదా అయింది. ఇప్పటి వరకూ జరిగిన రెండు షెడ్యూళ్లలో కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్స సీన్స్  చిత్రీకరించాం’’ అని అన్నారు.

చిత్రం శ్రీను,టెంపర్‌ వంశీ, మానిక్‌ రెడ్డి, సత్యకృష్ణ, షేకింగ్‌ శేషు, యోగి కత్రి, పటాస్‌ ప్రవీణ్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రజ్వల్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా శ్యామ్‌ కె నాయుడు, ఆర్ట్‌ డైరెక్టర్‌ గా చిన్నా వ్యవహరిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com