అనుష్క ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బిగ్ సర్ ప్రైజ్..!
on Jun 13, 2025

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది అనుష్క శెట్టి. ఒకానొక దశలో హీరోలకు సమానమైన క్రేజ్ ను చూసింది. అలాంటి అనుష్క 'బాహుబలి-2' తర్వాత సినిమాలు తగ్గించింది. గత ఏడేళ్లలో ఆమె నుంచి మూడే సినిమాలు వచ్చాయి. అనుష్క గత చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' 2023లో విడుదలైంది. ఈ జులై 11న 'ఘాటి'తో ప్రేక్షకులను పలకరించనుంది. (Anushka Shetty)
అనుష్క రెగ్యులర్ గా సినిమాలు చేయాలని, అలాగే తన స్టార్డంకి తగ్గ కథలు ఎంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే వారి కోరిక నెరవేరేలా ఉంది. అభిమానులను సంతోషపెట్టేలా అనుష్క మళ్ళీ సినిమాల్లో వేగం పెంచాలని నిర్ణయించుకుందట. ఈ క్రమంలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు తెలుస్తోంది.
లోకేష్ కనగరాజ్ తక్కువ సమయంలోనే కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా పేరు పొందాడు. ప్రస్తుతం రజినీకాంత్ తో 'కూలీ' చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. దీని తర్వాత కార్తితో 'ఖైదీ-2' చేయనున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందనున్న 'ఖైదీ-2'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను పెంచేలా.. ఈ ప్రాజెక్ట్ లోకి అనుష్క ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందంట.
'ఖైదీ-2'లో అనుష్క లేడీ డాన్ గా కనిపించనుందని, ఆమె రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. అదే నిజమైతే.. మునుపటి అనుష్కను మళ్ళీ స్క్రీన్ పై చూస్తాం అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ న్యూస్ తెలిసి.. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



