
ఈ వేసవిలో పెద్ద సినిమాల సందడి లేకపోయినా, చిన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఆ కోవలోకే వస్తుంది 'గోదారి గట్టుపైన' (Godari Gattupaina). గ్రామీణ నేపథ్యం, స్వచ్ఛమైన భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా సాధించిన కలెక్షన్లు ఇప్పుడు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి.
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'గోదారి గట్టుపైన' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం, ఈ మూవీ విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.3.06 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఒక చిన్న చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు రావడం విశేషమనే చెప్పాలి.
"Coolest Summer Entertainer" అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకులకు నిజంగానే మంచి రిలాక్సేషన్ ఇస్తోంది. ప్రేమ, స్నేహం, భావోద్వేగాలు, గోదావరి పరిసరాల అందాలు, సహజమైన నటన ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
ప్రస్తుతం థియేటర్లలో పెద్ద పోటీ లేకపోవడం 'గోదారి గట్టుపైన' చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారింది. వీక్ డేస్ లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా, నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.







