Home

»

Latest News

మహేష్ బాబు తీరుతో ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్.!

Jul 30, 2026 11:29AM

మహేష్ బాబు తాజాగా హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ తో కలిసి సందడి చేశాడు. ఈ ముగ్గురూ కలిసి హాలీవుడ్ ఫిల్మ్ 'ది ఒడిస్సీ' చూసినట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ తీరుపై ఘట్టమనేని సీనియర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు.

ఘట్టమనేని మూడో తరం వారసుడు జయకృష్ణ హీరోగా నటించిన మొదటి సినిమా 'శ్రీనివాస మంగాపురం' నేడు(జూలై 30) థియేటర్లలో అడుగుపెట్టింది. ఘట్టమనేని లాంటి స్టార్ ఫ్యామిలీ నుండి వారసుడు వస్తున్నాడంటే.. ఒక రేంజ్ లో హడావుడి ఉండాలి. కానీ, జయకృష్ణ లాంచ్ కి అలాంటి హడావుడి కనిపించలేదు. 

కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించకపోవడం ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసింది. మహేష్ చీఫ్ గెస్ట్ గా రావడానికి టైం ఇవ్వకపోవడంతోనే.. ఈవెంట్ నిర్వహించలేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

హాలీవుడ్ సినిమా చూడటానికి టైం కేటాయించిన మహేష్ బాబు, తన అన్నయ్య కొడుకు సినిమాను ప్రమోట్ చేయడానికి కూడా కాస్త సమయం కేటాయిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఎంత ప్రమోట్ చేసినా అంత ఇంపాక్ట్ ఉండదని.. అదే మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా ఈవెంట్ నిర్వహించి ఉంటే.. ఆ రీచ్ వేరే లెవెల్ లో ఉండి, సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయ్యేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

 

Srinivasa Mangapuram, Jaya Krishna Ghattamaneni, Mahesh Babu

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com