Home

»

Latest News

మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీస్ లిస్ట్ రిలీజ్.. అల్లు అర్జున్ ఎన్నో ప్లేస్‌లో ఉన్నాడంటే!

Jun 9, 2026 3:30PM

 

 

స్టార్‌డమ్ అంటే ఒకప్పుడు కేవలం సెల్యులాయిడ్ పై సాధించే బాక్సాఫీస్ కలెక్షన్లకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు సెలబ్రిటీ నిజమైన బ్రాండ్ విలువని కేవలం వారి సినిమాల హిట్, ప్లాప్ మాత్రమే కాకుండా, వారి సోషల్ మీడియా ఫాలోయింగ్, ప్రజల్లో ఉన్న అపారమైన నమ్మకం, అంతర్జాతీయ గుర్తింపు, మరియు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు వంటి అనేక కీలక అంశాలు శాసిస్తున్నాయి. తాజాగా ఫార్చ్యూన్ ఇండియా మరియు గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెన్సీ సంస్థ ఇంటర్‌బ్రాండ్ సంయుక్తంగా నిర్వహించిన మొట్టమొదటి విశ్లేషణాత్మక సర్వేలో 'భారతదేశ అత్యంత విలువైన సెలబ్రిటీల' జాబితాని  విడుదల చేశాయి. 

ఈ సరికొత్త ప్రతిష్టాత్మక జాబితాలో స్టార్ క్రికెటర్  విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచి తన తిరుగులేని బ్రాండ్ పవర్‌ను మరోసారి నిరూపించుకున్నారు. క్రీడా మైదానంలోనే కాకుండా వ్యాపార ప్రకటనల రంగంలో కూడా కోహ్లీ నంబర్ వన్‌గా దూసుకుపోతున్నాడు . ఇక ఈ జాబితాలో బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఎన్ని సంవత్సరాలైనా  షారుఖ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ సర్వే స్పష్టం చేసింది. అయితే ఈ జాబితాలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రియాంక చోప్రా ఏకంగా మూడో స్థానాన్ని దక్కించుకోవడం. గత ఏడేళ్లుగా భారతీయ థియేటర్లలో ప్రియాంక చోప్రా నటించిన ఒక్క సినిమా కూడా నేరుగా విడుదల కానప్పటికీ, ఆమె టాప్ 3లో నిలవడం ఆశ్చర్యపరుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆమె సంపాదించుకున్న గుర్తింపు, ప్రతిష్టాత్మక హాలీవుడ్ ప్రాజెక్టులు, గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ అత్యున్నత స్థాయిలో నిలబెట్టాయి.ప్రస్తుతం మహేష్, రాజమౌళిల వారణాసి చేస్తున్న విషయం తెలిసిందే.

మరోవైపు టాలీవుడ్ విషయానికి వస్తే, మన తెలుగు సినిమా సత్తా జాతీయ స్థాయిలో ఏ రేంజ్‌కు చేరిందో చెప్పడానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)నిదర్శనంగా నిలిచాడు . 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్, ఈ మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీల టాప్ 10 జాబితాలో సగర్వంగా పదో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. సౌత్ ఇండియా నుంచి జాతీయ స్థాయిలో ఇంతటి ఘనత సాధించడం టాలీవుడ్‌కు గర్వకారణంగా మారింది.

Also read: కుక్కని రాడ్ తో కొట్టి చంపేశారు.. బోరున ఏడుస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్ 

ఈ జాబితాలో ఇతర ప్రముఖుల స్థానాలను పరిశీలిస్తే, క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని నాలుగో స్థానంలో, యువ నటుడు రణ్‌వీర్ సింగ్ ఐదో స్థానంలో, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఆరో స్థానాన్ని దక్కించుకోగా, ఎన్ని తరాలు మారినా క్రేజ్ తగ్గని అమితాబ్ బచ్చన్ ఏడో స్థానంలో నిలిచి తన ప్రత్యేకతని చాటుకున్నారు. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఎనిమిదో స్థానంలో, నటి అలియా భట్ తొమ్మిదో స్థానంలో నిలిచారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com