
ఇళయ దళపతి విజయ్(Vijay)తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో 'సిగ్మా' (Sigma) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా హీరో, హీరోయిన్లుగా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. రీసెంట్ గా ఫరియా సోషల్ మీడియా వేదికగా సిగ్మాకి సంబంధించిన కీలక అప్ డేట్ ని ఇచ్చింది.
సిగ్మాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ప్రోమోకి సంబంధించిన అప్‌డేట్‌ను ఇస్తూ 'దోపిడీని స్టైల్ గా పూర్తి చేస్తూ సిగ్మా నుండి మొదటి సింగల్ సిగ్మా స్టైల్ ఈ నెల 4 న రాబోతుందని తెలిపింది. ఫరియా స్వయంగా ఈ అప్‌డేట్‌ని షేర్ చేయడంతో, సోషల్ మీడియాలో సదరు ప్రోమో న్యూస్ 2 గంటల్లోనే వేలాది వ్యూస్, లైకులతో ట్రెండ్ అవుతోంది. ఈ ఫస్ట్ సింగిల్‌ని దాదాపు 3 నుంచి 4 నిమిషాల నిడివితో, హై వోల్టేజ్ బీట్స్‌తో కంపోజ్ చేశారు. ఈ పాట యూత్‌ని, ముఖ్యంగా రీల్స్ ప్రియులని ఒక ఊపు ఊపేస్తుందని చిత్ర బృందం నమ్మకంతో ఉంది.
Also read: థియేటర్స్ ని షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్స్..ఓటీటీలో చూస్తే మైండ్ బ్లాక్
చాలా భాగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న సిగ్మా ని జులై 31 న రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు





