
'దృశ్యం'(Drishyam 3) సిరీస్ కి భారతీయ చలనచిత్ర రంగంలోనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల ట్రెండ్‌ని మార్చేసిన ఘనత దక్కుతుంది. 2013 లో ప్రారంభమైన ఈ సిరీస్ ఈ సంవత్సరం మే నెలలో వచ్చిన దృశ్యం 3 వరకు ఒకదాన్ని మించి ఒకటి విజయవంతమయ్యాయి. సాధించిన కలెక్షన్స్ నే అందుకు ఉదాహరణ.
ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్‌పై అలరించేందుకు సిద్ధమవుతోంది. స్ట్రీమింగ్ హక్కులని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ (SVOD), ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్ (TVOD) వంటి అన్ని ప్రధాన డిజిటల్ ఫార్మాట్లలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ చేయనున్నారు. థియేట్రికల్ రన్ ముగిసిన 30 నుండి 35 రోజులలోపు ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం జూన్ 18 లేదా జూన్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది.
Also read: డీజే టిల్లు దర్శకుడి నయా నిర్వాహకం.. ఉత్త అనుమానపక్షి అనుకుంటా
ఈ మూడో భాగం కథ విషయానికి వస్తే, వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జ్‌కుట్టి ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడాడనేది చూపించారు. అయితే ఈసారి కథలో ట్విస్టులు మరింత ఉత్కంఠని రేపుతాయి. జార్జ్‌కుట్టి పెద్ద కూతురు అంజుకి పెళ్లి చేయాలని చూస్తుండగా, వచ్చిన ప్రతి సంబంధం ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ అవుతుంటుంది. దీని వెనుక ఎవరో ఉండి కావాలనే సంబంధాలని చెడగొడుతున్నారని గ్రహించిన జార్జ్, ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలో పడతాడు. మరోవైపు సహదేవ్ అనే కానిస్టేబుల్ తనను ఎందుకు నిరంతరం ఫాలో అవుతున్నాడో అర్థం కాక జార్జ్‌కుట్టి సందిగ్ధంలో పడతాడు. ఈ అపరిచిత శత్రువు చుట్టే కథ మొత్తం నడుస్తూ చివరిలో జీతూ జోసెఫ్ మార్క్ అదిరిపోయే ట్విస్టులతో ముగుస్తుంది. థియేటర్లలో ఈ సస్పెన్స్ మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 230 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లని నమోదు చేసింది.






