Home

»

Latest News

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్: ఓటీటీలోకి రాజమౌళి మూవీ.!

Oct 28, 2026 11:14AM

ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don't Trouble The Trouble) ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో అక్టోబర్ 2న విడుదలైన ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్.. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించనుంది. అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

మలయాళంలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్.. 'పుష్ప' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’తో మొదటిసారి తెలుగు సినిమాలో హీరోగా నటించారు. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో, ఎస్.ఎస్. కార్తికేయ, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సినిమాకు శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ సూరి అనే పాత్రలో కనిపిస్తారు. అనాథగా పెరిగిన సూరి.. అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఓ గ్యాంగ్‌తో సమస్యలు రావడంతో పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో ఓ సంపన్న కుటుంబానికి చెందిన చిన్నారిని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేస్తాడు.

కానీ, దివ్య అనే చిన్నారిని కలిసిన తర్వాత సూరి జీవితం అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. తన తల్లిదండ్రులు కనిపించకుండా పోయారని చెప్పే దివ్య, ఆమె పెంపుడు కుక్క స్నూపీ చుట్టూ కథ ఆసక్తికరంగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? దివ్య వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనేది సినిమాలో చూడాలి.

ఫహాద్ ఫాజిల్‌తో పాటు సారా పాలేకర్, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ సంగీతం అందించగా, బ్రాడ్ ఫ్రాన్సిస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. 

థియేటర్లలో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ ఫాంటసీ కథ.. ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.

ఇది కూడా చదవండి: 'ఆదర్శ కుటుంబం' స్టోరీ మొత్తం చెప్పేసిన త్రివిక్రమ్.!

 

 

 

[Don't Trouble The Trouble OTT Release Date, Don't Trouble The Trouble OTT, Fahadh Faasil Telugu Movie, Dont Trouble The Trouble Netflix, Fahadh Faasil, SS Rajamouli, SS Karthikeya, Shashank Yeleti, Telugu OTT Releases]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com