Home

»

Latest News

తమిళ ప్రేక్షకులే ముద్దు అంటున్న దిల్ రాజు!

Jan 1, 2023 5:36PM

ప్రస్తుతం తెలుగు నాట సంక్రాంతి, తమిళనాడు పొంగల్ ల జోరు నడుస్తోంది. సాధారణంగా ఈ పండుగలకు భారీ స్థాయిలో స్టార్స్‌ చిత్రాలు పోటీ పడుతుంటాయి. ఈసారి 2023 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద  రెండు చిత్రాలు గ‌ట్టిగా పోటీ పడుతున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి జనవరి 12న విడుదల కానుండ‌గా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల కానుంది. ఒక్కరోజు గ్యాప్ లో రెండు భారీ చిత్రాలు తెలుగునాట సందడి చేయనున్నాయి. ఈ రెండు సినిమాల‌కు  సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ రెండు చిత్రాలను ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండడంతో రెండు చిత్రాలకి సమాన ప్రాధాన్యమిస్తూ ప్రమోషన్స్ లో నిర్మాతలు బిజీబిజీగా ఉన్నారు. చిరు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేస్తూనే మరోపక్క వీరసింహారెడ్డి ప్రమోషన్స్ ని వారు ఎక్కడా తగ్గకుండా నడిపిస్తున్నారు. 

ఇక ఈ రెండు చిత్రాలతో పాటు తెలుగులో కోలీవుడ్ స్టార్ దళపతి విజ‌య్ నటించిన వారిసు తెలుగులో వారసుడుగా, అజిత్ నటించిన తునివు తెలుగులో తెగింపుగా డబ్బింగ్ చిత్రాలుగా విడుదల కానున్నాయి. వారసుడు చిత్రాన్ని తెలుగు దర్శకుడైన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మూవీ లిరికల్ వీడియోలు బాగానే అంచనాలను పెంచేశాయి. తొలిసారి తెలుగు దర్శకుడు, నిర్మాతలతో విజయ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ కోసం  విజయ్‌ అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నెట్టింట ఈ మూవీని హైప్‌ చేస్తున్నారు. అయితే ఈ చిత్ర బృందం ప్రతిదీ మొదట తమిళ్ లో చేసి ఆ తర్వాత నింపాదిగా తెలుగు వైపు చూస్తున్నారు. తెలుగు ద‌ర్శ‌క‌నిర్మాత‌లై ఉండి కూడా వారు త‌మిళానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవలే చెన్నైలో భారీగా ఆడియో వేడుకలు చేశారు. తెలుగుకి మాత్రం సమయం తీసుకుంటున్నారు. ఇలాగే ప్రతి ప్రమోషన్, అప్డేట్ విషయంలోనూ వారు తెలుగులో ఆలస్యం చేస్తున్నారు. తమ టార్గెట్ తెలుగు కాదని దిల్ రాజు, వంశీ పైడిపల్లి, విజయ్‌లు చెప్పకనే చెప్తున్నారు. రెండు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు జోరుగా ప్రచారం మొదలు పెడితే విజయ్ వారసుడు ప్రమోషన్స్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. అయితే ఈ విషయంలో అజిత్ కంటే విజయ్ చాలా బెటర్. అజిత్ అసలు తన తెగింపు గురించి ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉంటూ ఉంటే విజయ్ మాత్రం ఎంతో కొంత ప్రమోషన్ చేస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే అజిత్ తునివి కంటే విజయ్ వారసుడు చిత్రమే కాస్త ప్రమోషన్స్ పరంగా ఓకే అనిపిస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com