
స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా మాస్ అండ్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు శివ ఒక కథని ధనుష్ కి వినిపించినట్టుగా వార్తలు వస్తున్నాయి. పక్కా రూరల్ గ్రామీణ నేపథ్యంతో కూడిన హై వోల్టేజ్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌ని శివ సిద్ధం చేశారట. ఇందులో ఉండే మాస్ ఎలివేషన్స్, ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఎలిమెంట్స్ ధనుష్‌కి నచ్చేశాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
దీంతో కథ విన్న వెంటనే ధనుష్ ఓకే చెప్పాడని, ప్రస్తుతం ధనుష్ చేతిలో చాలా పెద్ద ప్రాజెక్టులు, ప్యాన్ ఇండియా కమిట్‌మెంట్లు ఉన్నాయి. అవన్నీ పూర్తి కావడానికి కనీసం కొంత సమయం పట్టేలా ఉంది. ఈ లోపు సదరు కథ మరెవరికీ ఇవ్వద్దని, తన కోసమే హోల్డ్‌లో పెట్టాల్సిందిగా ధనుష్ ప్రత్యేకంగా డైరెక్టర్ శివని రిక్వెస్ట్ చేసినట్లుగా కూడా కోలీవుడ్ నుంచి గట్టి సమాచారం వినిపిస్తోంది. జనవరి 2027 నుండి ధనుష్ డేట్స్ కేటాయించేందుకు అంగీకరించినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అంటే దాదాపు ఒక ఏడాది ముందే ఈ క్రేజీ కాంబో లాక్ అయిందన్నమాట.
Also read: పట్నం బ్రతుకులు .. ఏం మిస్ అయ్యామో తెలిస్తే ఏడుపు ఆగదు
టాలీవుడ్‌లో వరుసగా వందల కోట్ల బడ్జెట్ తో ప్యాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్న ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. మైత్రీ సంస్థ ప్రస్తుతం కోలీవుడ్‌లోనూ తన జెండా ఎగరేయాలని చూస్తోంది. అందులో భాగంగానే ధనుష్, సిరుతై శివ లాంటి బిగ్గెస్ట్ కాంబినేషన్‌ని సెట్ చేసినట్లు టాక్. అయితే ఇప్పటి టి వరకు ఈ ప్రాజెక్ట్‌పై డైరెక్టర్ నుంచి గానీ, ఇటు హీరో లేదా నిర్మాణ సంస్థ నుండి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త హల్‌చల్ చేస్తోంది. శివ తెలుగులో దరువు, శంఖం, శౌర్యం చిత్రాలకి దర్శకత్వం వహించాడు.







