Home

»

Latest News

మహిళా ఫ్యాన్స్ తో ధనుష్ మీటింగ్: పంచిన వాటిపై ఉన్నది ఆ జాతీయ పార్టీ గుర్తేనా!

Oct 26, 2026 3:00PM

 

ధనుష్ రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమనే మాట రోజు రోజుకి జెట్ స్పీడ్ వేగంతో తన బలాన్ని పెంచుకుంటూ పోతుంది. అందుకు మరో అదనపు బలంగా ధనుష్ రీసెంట్ గా మహిళా అభిమానులతో మీటింగ్ ని ఏర్పాటు చేసాడు. కానీ ఇప్పుడు ఆ మీటింగ్ లో ఇచ్చిన బహుమతులు వైరల్ గా నిలిచాయి. వైరల్ గా నిలవడమే కాకుండా ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు వెతకాల్సిన పరిస్థితి.

ఈ కార్యక్రమానికి హాజరైన అభిమానులకి బహుమతిగా వెండి దీపాలని  అందజేశారు. అయితే, ఆ దీపాలపై కమలం గుర్తు కనిపించడంతో వైరల్ అవుతుంది. ఎందుకంటే కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల చిహ్నం కావడంతో, ఈ బహుమతుల వెనుక ఏదైనా రాజకీయ ఉద్దేశం ఉందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ధనుష్ అభిమానులతో నిర్వహించిన కార్యక్రమం కాస్తా రాజకీయ చర్చకు దారితీయడం ఆసక్తిని రేకెత్తించింది. 


ఇది కూడా చదవండి: నాకు 35 ఏళ్ళు పట్టింది: రష్మిక పై మధుబాల కీలక వ్యాఖ్యలు! 

 

ఈ విషయంపై ధనుష్ అభిమాన సంఘం ప్రతినిధి స్పందిస్తు 'వెండి దీపాలపై కనిపించిన కమలం గుర్తుకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. అది దీపాలని  తయారు చేసిన సంస్థకు చెందిన ముద్ర మాత్రమేనని వివరించారు.ఏది ఏమైనా కమలం గుర్తుతో పంపిణి చేసిన వెండి దీపాలు విషయం మాత్రం తమిళ నాట సంచలనంగా మారింది. ధనుష్ ఇటీవల ఢిల్లీ వెళ్లి కొంత మంది పెద్దలని కలవడం,విజయ్ నేతృత్వంలోని టివికె పార్టీ మినిస్టర్ విమర్శలు కూడా చేసిన విషయం తెలిసిందే.

 

[Dhanush During a Meeting With Female Fans, Dhanush female fans meeting, viral incident, celebrity fan moment, emotional encounter, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]
 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com