Home

»

Latest News

హీరోయిన్ గా దేవయాని కూతురు!  

Oct 27, 2026 2:53PM

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేత 'ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి, నా ముందు కొచ్చింది చిరు చిందులేసి' అని పాడేలా చేసిన భామ దేవయాని. ప్రేమలేఖ మూవీ ద్వారా కూడా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. ఇప్పుడు ఆమె కూతురు ప్రియాంక రాజకుమారన్ (ఇనియా) హీరోయిన్‌గా తన రెండో చిత్రంతో అభిమానులని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. 


నిజానికి ప్రియాంక రంజన్‌.. 'ది అడ్వకేట్‌' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. తాజాగా ప్రియాంక రెండో చిత్రమూ మొదలైంది. ఈమె నటిస్తున్న ఈ సినిమాకు బ్లాక్‌ నైట్‌ బాయ్స్‌ టైటిల్‌ నిర్ణయించారు. ఈ చిత్రంతో సీరియల్ నటుడు అమల్‌ అజిత్‌ హీరోగా పరిచయమవుతున్నాడు.

 

ఇది కూడా చదవండి: షావుకారు జానకి కుమార్తెకి ప్రమాదం: వీల్ చైర్ నుంచి కిందపడి నిశ్శహయ స్థితిలో!  

 


కేఈ.మణికంఠన్‌ అలియాస్‌ విమల్‌.జీ నిర్మిస్తున్నారు. సెంబర్‌ వి.మురుగేశన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. వైవిధ్య భరితరిత ప్రేమతో కూడిన జనరంజక కుటుంబ కథా చిత్రంగా ఇది ఉంటుందని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలని త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

 

 

[Devayani Daughter Priyanka Debut, Devayani daughter Priyanka, Black Night Boys movie, Amal Ajith actor, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com