నెట్ ఫ్లిక్స్ లో దేవర సంచలనం.. ఇదీ ఎన్టీఆర్ రేంజ్...
on Jan 25, 2025
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'దేవర' (Devara). యువసుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా 2024 సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమా డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ, ఆ టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోనూ అలాంటి సంచలనాలే సృష్టిస్తోంది.
'దేవర' సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 8న నెట్ ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టిన దేవర.. వరుసగా పది వారాల నుంచి టాప్-10 లో ట్రెండ్ అవుతోంది. పదో వారంలో కేవలం ఇండియాలోనే కాకుండా బంగ్లాదేశ్, ఒమన్ వంటి దేశాల్లోనూ టాప్-10 లో ట్రెండ్ అవుతుండటం మరో విశేషం. (Devara on Netflix)
డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమా థియేటర్లలో రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టడమే గొప్ప విషయం అంటే, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో వరుసగా పది వారాల నుంచి ట్రెండింగ్ లో నిలవడం అనేది మరో గొప్ప విషయమని.. ఇది ఎన్టీఆర్ స్టార్డం వల్లనే సాధ్యమైందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
