
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ, రాజకీయ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ భూవివాదంలో చంద్రశేఖర్ రెడ్డితో పాటు మురళీధర్ రెడ్డి, గడ్డం రవిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంత్రి కాస్మోస్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన వివాదంపై.. స్థానిక ఓనర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఓనర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కొందరు వ్యక్తులు మంత్రి కాస్మోస్ ప్రాంగణంలోకి అక్రమంగా చొరబడి, గేటు తాళాలు పగులగొట్టి, అక్కడి నిర్మాణాలను ధ్వంసం చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించడంతో పాటు ప్రాంగణంలో టిన్‌షీట్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు.

మంత్రి కాస్మోస్ ప్రాంగణంలోకి చొరబడి బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓనర్స్ అసోసియేషన్ పోలీసులను కోరింది. అక్రమ ప్రవేశం, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
[Icon Star Allu Arjun, Kancharla Chandrasekhar Reddy, Allu Arjun Father In Law, Mantri Cosmos Nanakramguda, Allu Arjun Latest, Telugu Film News, Telugu News, Hyderabad]





