Home

»

Latest News

భార్యను ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయిన అలీ.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ కమెడియన్.!

Oct 27, 2026 12:47PM

సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే అలీ.. నిజ జీవితంలో మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే ఆయన తన భార్య జుబేదా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను చూసి అలీ ఏడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు.

అలీ భార్య జుబేదా ఇటీవల గుండెకు సంబంధించిన సమస్యతో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు హార్ట్ సర్జరీ చేయాలని సూచించడంతో శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విషయాన్ని జుబేదా స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం, ఆమెకు చేసిన సర్జరీ విజయవంతమైంది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు.

అయితే ఎప్పుడూ చలాకీగా కనిపించే తన భార్య ఆస్పత్రి బెడ్‌పై ఉండటాన్ని చూసి అలీ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఏడుస్తున్న ఆయన వీడియో నెటిజన్లను కదిలిస్తోంది. తెరపై తన కామెడీతో అందరినీ నవ్వించే అలీని ఇలా చూడటం అభిమానులకు కూడా బాధ కలిగిస్తోంది.

ఈ వీడియోను జుబేదా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన భర్తపై ప్రేమను వ్యక్తం చేశారు. అలీ లాంటి ప్రేమించే, తన గురించి ఎంతో శ్రద్ధ తీసుకునే భర్త దొరకడం తన అదృష్టమని పేర్కొన్నారు. జీవిత భాగస్వామి ప్రేమగా తోడుంటే మహిళలు తమ కలలను నెరవేర్చుకోవడానికి మరింత ధైర్యం వస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. 

ముఖ్యంగా "మా వారిని ఇక ఎప్పుడూ ఇలా చూడకూడదు నేను" అంటూ జుబేదా షేర్ చేసిన ఒక షార్ట్ వీడియో.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

బాలనటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అలీ.. ఆ తర్వాత స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటుడిగానే కాకుండా టీవీ షోలకు హోస్ట్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.

తెరపై ఎప్పుడూ నవ్వులు పంచే అలీ.. తన భార్య విషయంలో ఇలా భావోద్వేగానికి గురైన వీడియో చూసి అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

ఇది కూడా చదవండి: ఇండస్ట్రీ హిట్.. ‘జైలర్ 2’తో చరిత్ర సృష్టించిన రజనీకాంత్.!

 

 

 

[Comedian Ali Emotional Video, Comedian Ali Wife Health Update, Ali Wife Heart Surgery, Comedian Ali Wife Zubaida, Ali Family News, Zubaida Health Update, Viral Video, Telugu Film News

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com