
మెగాస్టార్ చిరంజీవి.. వెండితెరపై తనదైన ముద్ర వేసిన ఈ లెజెండరీ నటుడు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోనూ సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లూ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన చిరు.. ఇప్పుడు సెలబ్రిటీలతో సరదాగా ముచ్చటిస్తూ, తన జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆయన ఓ ప్రత్యేకమైన టాక్ షో చేయనున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతోంది. ఈ షోకు ‘మెగావర్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి టాక్ షో ఆలోచన వెనుక చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, రచయిత బీవీఎస్ రవి ఉన్నట్లు సమాచారం. వారి ప్రతిపాదనకు చిరు అంగీకారం తెలిపారని, నెట్‌ఫ్లిక్స్‌తో ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యాయని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ‘మెగావర్స్’ అనే టైటిల్ తెరపైకి రావడంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి మరింత పెరిగింది.
1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో నటుడిగా ప్రయాణం ప్రారంభించిన చిరంజీవి.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. విభిన్న పాత్రలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
2028 నాటికి ఆయన సినీ ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో ‘మెగావర్స్’ టాక్ షోలో తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకోనున్నట్లు సమాచారం. సినిమాల్లో ఎదురైన ఒడిదుడుకులు, విజయాల వెనుక ఉన్న కష్టాలు, ప్రముఖ దర్శకులు, నటీనటులతో తనకున్న అనుబంధాలు వంటి అంశాలు ఈ కార్యక్రమంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆయన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలకూ ఇందులో చోటు ఉండొచ్చని తెలుస్తోంది.
.webp)
మొత్తానికి, ‘మెగావర్స్’ మొదలైతే చిరంజీవి కెరీర్లో ఇది మరో కొత్త అధ్యాయం కానుంది. ఇంతకాలం వెండితెరపై చూసిన మెగాస్టార్‌ను.. ఇప్పుడు టాక్ షోలో మనసు విప్పి మాట్లాడే వ్యక్తిగా చూడొచ్చన్నమాట. మరి ఈ కార్యక్రమానికి నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడు అధికారిక ప్రకటన ఇస్తుంది? చిరుతో ముచ్చటించబోయే సెలబ్రిటీలు ఎవరు? అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: రష్మిక షాకింగ్ కామెంట్స్.. విజయ్ కోసం వెయ్యిసార్లయినా అదే చేస్తా.!
[Chiranjeevi Talk Show Name, Chiranjeevi Megaverse Talk Show, Chiranjeevi Netflix Show, Chiranjeevi OTT Debut, Megastar Chiranjeevi, Megaverse Show, Sushmita Konidela, BVS Ravi, Telugu Film News]






