Home

»

Latest News

మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్‌ కామెంట్స్ వైరల్!

Oct 29, 2026 4:56PM


మాస్ కి బొడ్డు కోసి పేరు పెడితే అది మెగాస్టార్ చిరంజీవి అనే విషయం తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ కాకా కంటే ముందే చిరు సందడి ప్రతి అభిమాని, తెలుగు ప్రేక్షకుడి ఇంట తీసుకురానున్నారు. అదేనండి ఓటిటి వేదికగా జరిగే టాక్ షో కి అన్నయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే 


ఇప్పుడు ఆ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అయిన  నెట్ ఫ్లిక్స్ త్వరలోనే షో టెలికాస్ట్ కానుందని అధికారంగా ప్రకటించింది. పైగా మాస్ కి గ్రామర్, స్టైల్ కి మీనింగ్ అంటూ ఫ్యాన్స్ కి  పూనకాలు తెప్పించే  క్యాప్షన్ తో పోస్టర్ కూడా రిలీజ్ చేయడంతో చిరు ఓటిటి హంగామాని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్ధం చేసుకోవచ్చు.మెగావర్స్ అనేది షో టైటిల్.

ఇది కూడా చదవండి: శ్రీనిధి శెట్టి కాళ్ళకి ఎందుకు నమస్కరించానంటే: త్రివిక్రమ్ చెప్పిన సమాధానం ఇదే!

 


అయితే ఇటీవల చిత్రీకరించిన షో లో మూడు తరాలకి చెందిన హాస్య నటులు బ్రహ్మానందం, సునీల్,సత్య పాల్గొన్నారు. మరి షో నే తొలి షో గా వస్తుందా లేక మరొకటి ఉంటుందా చూడాలి. టెలికాస్ట్ డేట్ కోసమైతే ఫ్యాన్స్ వెయిటింగ్.     

 

 

[Chiranjeevi Makes Netflix Debut With Talk Show Megaverse, Netfilx About Chiranjeevi OTT MegaVerse, Netflix talk show,Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com