Home

»

Latest News

ఏంటి తంబీ ఈ కలెక్షన్స్.. చెన్నై లవ్ స్టోరీ మూడు రోజుల పరిస్థితి ఇదే!

Jul 27, 2026 11:01AM

 

యువతీ యువకుల మధ్య పుట్టే ప్రేమ స్వచ్ఛమైన జీవనది లాంటిదని, అది ఏ ఒక్కరి దగ్గరే ఆగిపోదని నిరూపించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ  పెర్ ఫార్మెన్స్ కి థియేటర్ నుంచి ప్రతి ఒక్కరు కన్నీళ్లతో బయటకి వస్తున్నారు. యువత టార్గెట్ గా తెరకెక్కించినా ఫ్యామిలీస్ కూడా సబ్జెక్టు కి కన్నీటి అవుతున్నారు. నిన్న చాలా వరకు థియేటర్స్ హౌస్ ఫుల్. హైదరాబాద్ , విజయవాడ, గుంటూరు, తిరుపతి విశాఖపట్నం లాంటి ఏరియాస్ లో అయితే  బ్లాక్ లో టికెట్స్ అమ్మారంటే మూవీపై ఉన్న క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు.

ప్రీమియర్స్ నుంచే కలెక్షన్స్ సునామీని సృష్టించగా  మొత్తం మూడు రోజులకి వరల్డ్ వైడ్ గా 30 కోట్ల  కలెక్షన్స్ సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు  చెప్తున్నాయి. మరి ఈ జోరు ఇలాగే కొనసాగితే ఎండింగ్ కి బాక్స్ ఆఫీస్ వద్ద తన దైన మార్క్ చూపించడం ఖాయం. తొలి రోజే  ఇండియాలో  5.69 కోట్ల గ్రాస్  ఓవర్సీస్ 2.60 కోట్ల గ్రాస్‌ కలుపుకొని  8.29 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లని రాబట్టింది. రెండవ రోజు ఇండియా గ్రాస్ వసూళ్లు  12.02 కోట్లు కాగా,ఓవర్ సీస్   1.20 కోట్లు. దీంతో  రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 15.82 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించింది. తమిళనాడు, కేరళ మరియు మిగిలిన భారతీయ ప్రాంతాల నుంచి కూడా గణనీయమైన వసూళ్లు నమోదవుతున్నాయి.


రవి నంబూరి దర్శకత్వంలో సాయి రాజేష్, ఎస్ కె ఎన్  30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా నాన్థియేట్రికల్ హక్కుల రూపంలోనే 35 కోట్ల భారీ బిజినెస్ జరగడం నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ సోనీ లివ్ (Sony LIV) భారీ ధరకి  దక్కించుకుంది.

Kiran abbavaram, Sri Gouri priya, Chennai Love Story

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com