Home

»

Latest News

Peddi: మెగా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. పెద్ది నిర్మాతలు సంచలన నిర్ణయం!

Jun 1, 2026 12:40PM

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 4, 2026 న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన కంటెంట్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. అయితే ఈ హైప్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకువెళ్లడానికి ఒక పవర్‌ఫుల్ 'రిలీజ్ ట్రైలర్' కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో పెద్ద సినిమాలకు రిలీజ్‌కు రెండు మూడు రోజుల ముందు సెకండ్ ట్రైలర్ వదలడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే పెద్ది మేకర్స్ మాత్రం ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్స్ లో న్యూస్ వినిపిస్తోంది.

‘పెద్ది’ సినిమాకు ఎలాంటి లాస్ట్ మినిట్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ లేదని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన కంటెంట్, సాంగ్స్, మెయిన్ ట్రైలర్ అందించిన బజ్ పట్ల మేకర్స్ పూర్తి సంతృప్తితో ఉన్నారట. కొత్తగా మళ్లీ మరో ట్రైలర్ కట్ చేసి ప్రమోషన్స్ చేయడం కంటే, నేరుగా థియేట్రికల్ రిలీజ్‌కే వెళ్లడం ఉత్తమమని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. 

నేడు(జూన్ 1) విజయవాడలో నిర్వహించనున్న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో ప్రమోషన్ పతాక స్థాయికి చేరుతుందని, ఇక సినిమాను నేరుగా వెండితెరపై చూసి ఎంజాయ్ చేయడమే మిగిలిందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. జూన్ 3న రాత్రి ప్రీమియర్స్ తోనే పెద్ది బాక్సాఫీస్ వేట మొదలు కానుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com