Home

»

Latest News

లంచగొండిని లైవ్ లో హత్య చేసిన భారతీయుడు!

Mar 09, 2026

  • అవినీతి అనే క్యాన్సర్ పై భారతీయుడు యుద్ధం 
  • లంచగొండితనాన్ని అంతం చేసినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం

సామాజిక స్పృహతో కూడిన సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా అవినీతి అనే క్యాన్సర్, వ్యవస్థను ఎలా తొలిచేస్తుందో కళ్ళకు కట్టినట్లు చూపించిన చిత్రం 'భారతీయుడు'. దర్శకుడు శంకర్ అద్భుత సృష్టికి, లోకనాయకుడు కమల్ హాసన్ ప్రాణం పోసిన తీరు అమోఘం. ఈ సినిమాలో ఆయన పలికిన సంభాషణలు, చూపిన ఆవేశం నేటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. (Bharateeyudu)

'భారతీయుడు' కేవలం ఒక సినిమా కాదు, అది ఒక ఆవేదన. స్వాతంత్ర్య సమరయోధుడైన సేనాపతి (కమల్ హాసన్).. ఎందరో ప్రాణాలర్పించి సాధించిన స్వాతంత్ర్యం లంచగొండితనంలో కూరుకుపోవడం చూసి సహించలేక 'భారతీయుడు'గా మారి అవినీతిపరులను అంతం చేసే కథ ఇది. 75 ఏళ్ల వయసున్న వృద్ధుడిగా కమల్ హాసన్ మేకప్ మాత్రమే కాదు, ఆయన నడక, చూపు, గంభీరమైన స్వరం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. 80 వేల మంది పోలీసులు వెతికినా, ఆయన నీడను కూడా తాకలేరన్న డైలాగ్ ఆయన పాత్రలోని పవర్‌ను తెలియజేస్తుంది.

కదిలించే సన్నివేశం
వ్యవస్థలో లంచం అనేది ఎంతలా పాకిపోయిందో వివరిస్తూ.. లంచం తీసుకోవాలంటే భయపడేలా ఒక లంచగొండిని లైవ్ లో హత్య చేసే సన్నివేశం ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచింది.

ఆ సీన్‌లో కమల్ హాసన్ చెప్పే మాటలు కళ్ళు తెరిపించేలా ఉంటాయి. "మన దేశంలో బిడ్డ పుట్టిన ప్రసూతి కేంద్రం నుండి, మనిషిని కాల్చే స్మశానం వరకు ప్రతి అడుగులోనూ లంచం అడుగుతున్నారు. చిన్న చిన్న లంచాలే కదా అని మనం ఇచ్చే అలక్ష్యం చేయడం వల్లే.. ఇది ఇది వ్యవస్థకు ఒక భయంకరమైన క్యాన్సర్ వ్యాధిలా ఆవహించింది." అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు సేనాపతి. 

కలుపు మొక్కల ఏరివేత
పచ్చని స్వతంత్ర భారతావనికి లంచాల చిచ్చుపెట్టే స్వార్థ ప్రభుత్వోద్యోగులను 'కలుపు మొక్కలు'గా అభివర్ణిస్తూ, ఆ చిచ్చు చల్లార్చాలంటే ఆ మొక్కలను ఏరి పారేయక తప్పదని కమల్ హాసన్ పాత్ర హెచ్చరిస్తుంది. "లంచం తీసుకున్నా చంపుతాను, ఇచ్చినా చంపుతాను, లంచం ఇవ్వలేదని పని జాప్యం చేసినా వదిలేది లేదు" అంటూ ఆయన చేసే గర్జన అవినీతిపరుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. ఆయన పట్టుకున్న కత్తి ఆయుధం మాత్రమే కాదు.. అవినీతిపరులకు కలిగించే 'మరణ భయం'.

కమల్ హాసన్ తన అద్భుత నటనతో ఒక సామాన్యుడిలోని ఆవేశాన్ని వెండితెరపై ఆవిష్కరించారు. వ్యవస్థ మారాలంటే కేవలం చట్టాలు సరిపోవని, ప్రతి ఒక్కరిలో నిజాయితీ ఉండాలని ఈ సినిమా చాటిచెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున చాక్లెట్లు పంచుకోవడం వల్ల దేశభక్తి రాదు, లంచగొండితనాన్ని అంతం చేసినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని ఈ చిత్రం అందించిన సందేశం ఎప్పటికీ నిలిచిపోతుంది.

మరిన్ని హై-వోల్టేజ్ సినిమా సీన్లు, ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com