Home

»

Latest News

ఒకే వేదికపై రాజకీయ, సినీ దిగ్గజాలు.. బండ్ల గణేష్ కుమార్తె జ‌న‌ని పెళ్లి వేడుక!

Aug 16, 2026 2:23PM

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి అంబరాన్ని తాకింది. ఆయన కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో ఆగస్టు 16న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చి నవదంపతులను ఆశీర్వదించారు.

ఈ వివాహ మహోత్సవంలో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి విచ్చేసి నవ వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు అగ్ర నటులు, నిర్మాతలు, దర్శకులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. సినీ మరియు రాజకీయ ప్రముఖులు ఒకే వేదికపై కలవడంతో కల్యాణ మండపం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. బండ్ల గణేష్ స్వయంగా అతిథులకు దగ్గరుండి స్వాగతం పలికారు.

కమెడియన్ నుండి బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన బండ్ల గణేష్, 'గబ్బర్ సింగ్', 'బాద్ షా', 'టెంపర్', 'ఇద్దరమ్మాయిలతో' వంటి భారీ చిత్రాలను నిర్మించి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లోనూ, సోషల్ మీడియాలోనూ ఆయన చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి.

ఇటీవలే తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను తిరుమల శ్రీవారి పాదాల వద్ద ఉంచి, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బండ్ల గణేష్ ఇంట జరిగిన ఈ డెస్టినేషన్ తరహా గ్రాండ్ వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com