
సినిమా పేరు: బ్యాండ్ మేళం
నటీనటులు: హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయికుమార్, గోపరాజు విజయ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
ఎడిటింగ్: శివ ముప్పరాజు
మ్యూజిక్:విజయ్ బుల్గానిన్
నిర్మాత: కోన వెంకట్
బ్యానర్: కోన ఫిలిం కార్పొరేషన్
రచన,దర్శకత్వం: సతీష్ జవ్వాజి
రిలీజ్ డేట్ : మార్చి 26 , 2026
కోర్ట్ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి ఈ రోజు బ్యాండ్ మేళంతో మరో సారి సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయ్యారు. భారీ హిట్ చిత్రాల రైటర్ కోన వెంకట్ నిర్మాత కావడం, ప్రచార చిత్రాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ బ్యాండ్ మేళం చుట్టూ వైఫైలా చక్కర్లు కొడుతుండటంతో మూవీ లవర్స్, ప్రేక్షకుల కన్ను బ్యాండ్ మేళం పై పడింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం
కథ
గిరి(హర్ష్ రోషన్) రాజి(శ్రీదేవి) బావ మరదళ్ళు..పుట్టినప్పటి నుంచే ఒకరంటే ఒకరికి ప్రాణం. ఆ ఇద్దరి తల్లితండ్రులు కూడా గిరి, రాజి ఒకరి కోసం ఒకరు పుట్టారని పెద్దయ్యాక పెళ్లి చేయాలనీ అనుకుంటారు. కానీ రాజి ఇంజనీరింగ్ లో చేరాక గిరిపై చిరాకుని, ద్వేషాన్ని చూపిస్తుంది. దీంతో గిరి తట్టుకోలేకపోతాడు. రాజికి తండ్రి సాయిలు( సాయికుమార్) వేరే పెళ్లి ఫిక్స్ చేస్తాడు. పైగా చదువు లేకుండా మ్యూజిక్ అంటూ తిరుగుతాడని మేనల్లుడు గిరి అంటే చాలా కోపం కూడా. పెళ్లి జరిగే రోజు తన కాలేజీ అబ్బాయిని ప్రేమించానని లెటర్ రాసి రాజి లేచిపోతుంది. మరి రాజి నిజంగానే తన కాలేజీ అబ్బాయి ప్రేమలో పడి లేచిపోయిందా? లేక పెళ్లిని తప్పించుకోవడానికి అలా క్రియేట్ చేసిందా! అసలు గిరిపై ఉన్న ప్రేమ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది! నిజంగానే గిరిపై ద్వేషం ఉందా? రాజిపై ప్రేమని పెంచుకున్న గిరి తీసుకున్న నిర్ణయం ఏంటి? చివరకి బ్యాండ్ మేళం ఏం చెప్పిందనేదే చిత్ర కథ
ఎనాలసిస్
కథగా చెప్పుకుంటే బాగుండటంతో పాటు కథనం కూడా సినిమా చూస్తున్నంత సేపు బాగానే ఉంటుంది. కానీ కథకి ఆయువుపట్టైన మెయిన్ పాయింట్ ప్రీ క్లైమాక్స్ వరకు రాదు. పైగా రాజి బాగా చదువుకున్న తెలివైన అమ్మాయితో పాటు టాపర్. అలాంటి అమ్మాయి గిరి విషయంలో వాళ్ళ నాన్న విషయంలో తీసుకునే నిర్ణయం లాజిక్కే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మంచి ఇంట్రెస్ట్ గా ఎనర్జిటిక్ గా సాగుతుంది. గిరి, రాజి మధ్య వచ్చిన సీన్స్, ఆ ఇద్దరి తల్లి తండ్రుల మధ్య వచ్చిన సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా గిరి తండ్రి దాన ధర్మాలతో ఆస్తులు పోగొట్టుకున్నా, ఆ బాధని మైండ్ లోకి కూడా రానీయకుండా మంచి తనాన్ని ప్రదర్శించే సీన్స్ చాలా బాగున్నాయి. గిరి అతని బ్యాండ్ ట్రూప్ మధ్య వచ్చిన సీన్స్ నవ్వులు పూయిస్తాయి. మ్యూజిక్ ఆల్బమ్ చెయ్యడానికి గిరి అండ్ బాచ్ తమ ఊరిలోనే దొంగతనం చేసే సీన్స్ గిరి ఫ్రెండ్ లేచిపోయిన తన మరదలిని పెళ్లి చేసుకునే సందర్భంగా వచ్చే సీన్స్ అయితే ఎక్స్ లెంట్. ఇంటర్వెల్ ట్విస్ట్ వర్క్ అవుట్ కాలేదు. సెకండ్ హాఫ్ లో చూసుకుంటే కొన్ని సీన్స్ బాగున్నా, ఫస్ట్ హాఫ్ లో వస్తున్న సీన్స్ చూసినట్టుగానే ఉంది. గిరి ఇంట్లోనే రాజి ఉంటూ ఉద్యోగానికి వెళ్లడం అనే లైన్ బాగున్నా ఆ ఇద్దరి మధ్య వచ్చిన సీన్స్ రొటీన్. పైగా గిరి కోసమే రాజి డ్రామా చేస్తుందనే విషయం మనకి స్టార్టింగ్ నుంచే అర్థమవుతు ఉంటుంది. కాబట్టి గిరిని రెచ్చగొడుతూ అతను లైఫ్ లో సెటిల్ కావడానికి రాజి ప్రయత్నాలు చేయాల్సింది. క్లైమాక్స్ పర్లేదు
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
గిరిగా హర్ష్ రోషన్ పెర్ ఫార్మెన్స్ ఎనర్జిటిక్ గా సాగింది. ఆల్ వేరియేషన్స్ లోను సూపర్ అండ్ మెచ్యూర్డ్ గా చేసాడు. డాన్స్ లు కూడా ఇరగదీయడంతో పాటు ఫ్యూచర్ లో నాకు మంచి హీరో దొరికాడని తెలుగు సిల్వర్ స్క్రీన్ మురిసిపోయేలా చేసాడు.శ్రీదేవి కూడా మరో సారి నాచురల్ పెర్ఫార్మ్ ని ప్రదర్శించింది. కాకపోతే తన పెర్ఫార్మ్ ప్రదర్శించడానికి స్కోప్ మాత్రం ఎక్కువగా రాలేదు. మిగతా క్యారెక్టర్స్ లో చేసిన సాయికుమార్, గోపరాజు విజయ్ అండ్ విజయ్ వైఫ్, ఫ్రెండ్స్ గా చేసిన అందరూ కూడా తగ్గేదేలే అనే విధంగా మెస్మరైజ్ చేసారు. సతీష్ నుంచి వచ్చిన డైలాగ్స్, డైరెక్షన్ బాగున్నా మెయిన్ పాయింట్ చుట్టూ కధనాన్ని అల్లుకోవడంలో పొరపాట్లు చేసాడు. కోన వెంకట్ నుంచి వచ్చిన నిర్మాణ విలువలు బాగున్నాయి. విజయ్ బుల్గానిన్ సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్స్ ఆర్డినరీ. సతీష్ ముత్యాల ఫొటోగ్రఫీ అతిపెద్ద ఎస్సెట్.
ఫైనల్ గా చెప్పాలంటే ఆర్టిస్టులు తమ పెర్ఫార్మ్ తో మెప్పించారు. కథనంలోని లోపాల వ ల్ల 'బ్యాండ్ మేళం' మోత నామమాత్రమే.
బలాలు
1 . హర్ష్ రోషన్ పెర్ఫార్మెన్స్
2 . కామెడి సీన్స్
3 .ఫొటోగ్రఫీ
4 మ్యూజిక్
5 .డైరెక్షన్
6 . ఫస్ట్ హాఫ్
బలహీనతలు
1 . కథ
2 .సెకండ్ హాఫ్
3 ప్రీ క్లైమాక్స్
4 . క్లైమాక్స్
రేటింగ్ 2 .5 /5 అరుణాచలం






