Home

»

Latest News

బాహుబ‌లిని ఫాలో అవుతున్న బాల‌య్య‌

Apr 02, 2018

 

ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని మొద‌లెట్టేశాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. అయితే రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్ప‌టి నుంచి అనేది మాత్రం ఇంకా తెలియ‌డం లేదు. కాక‌పోతే.. ఈ సినిమా కోసం బాల‌య్య చాలా జాగ్ర‌త్త‌లే తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి హైప్ తీసుకురావ‌డానికి ముందు నుంచే గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ విష‌యంలో బాల‌య్య బాహుబ‌లిని ఫాలో అవుతున్న‌ట్టు టాలీవుడ్ టాక్‌. బాహుబ‌లి.... 2 భాగాలుగా విడుద‌లై.. సంచ‌ల‌నం సృష్టించింది. ఓ తెలుగు సినిమాని రెండు భాగాలుగా చూడ‌డం అదే మొద‌టిసారి. ఇప్పుడు బాల‌కృష్ణ కూడా బ‌యోపిక్‌ని రెండు భాగాలుగా తీయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.  క‌థ రాసింది రాసిన‌ట్టు తీస్తే 5 గంట‌ల సినిమా అవుతోందని ప్రారంభోత్స‌వ వేడుక‌లో స్వ‌యంగా బాల‌య్యే చెప్పాడు. దాన్ని కుదించి, కుదించి రెండున్న‌ర గంట‌ల సినిమాగా తీసుకొచ్చే ప్ర‌య‌త్నం మొద‌లైంది. ఇప్పుడు.. `అలా స‌న్నివేశాల‌న్నీ తీసేయ‌డం ఎందుకు?  దాన్నే రెండు భాగాలుగా తీయొచ్చు క‌దా` అనే ఆలోచ‌న వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినీ జీవితం అంతా ఒక భాగం, రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర‌వాత మ‌రో భాగంగా తీస్తే బాగుంటుంద‌ని బాల‌య్య‌కు తేజ స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. దీనిపై ఇప్పుడు లోతుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌వేళ రెండు భాగాలుగా తీస్తే గ‌నుక‌.. బాహుబ‌లి త‌ర‌వాత అలాంటి ప్ర‌య‌త్నం చేసిన తొలి సినిమా ఇదే అవుతుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com