అప్పుడు యాక్సిడెంట్.. ఇప్పుడు సూసైడ్.. విజయ్ ఆంటోనికే ఎందుకిలా..
on Sep 19, 2023
మ్యూజిక్ డైరెక్టర్ గా కంటే 'బిచ్చగాడు' హీరోగానే తెలుగువారికి బాగా చేరువయ్యారు మల్టిటాలెంటెడ్ విజయ్ ఆంటోని. ఇక 'బిచ్చగాడు' సీక్వెల్ గా వచ్చిన 'బిచ్చగాడు 2' కూడా మంచి ఆదరణ పొంది.. విజయ్ కి మరింత గుర్తింపు తీసుకువచ్చింది.
ఇదిలా ఉంటే, ఈ ఏడాది విజయ్ ఆంటోనికి విషాద నామ సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే.. జనవరి నెలలో 'బిచ్చగాడు 2' షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు జరిగిన బోట్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డారు విజయ్. ఆ ప్రమాదం కారణంగా.. అతని దవడ, పళ్ళు విరిగిపోయాయి. ఒక రకంగా చావు అంచు వరకు వెళ్ళొచ్చారాయన. ఈ ప్రమాదం నుంచి కోలుకోవడానికి 3 నెలలకి పైగా సమయం పట్టింది. ఈ యాక్సిడెంట్ తాలుకు చేదు ఙ్ఞాపకాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న విజయ్ ఆంటోనికి.. ఈ రోజు ఆయన కుమార్తె మీరా ఆత్మహత్య పెద్ద షాక్ అనే చెప్పాలి. ఏదేమైనా.. ఒకే సంవత్సరంలో ఇలా విజయ్ ఆంటోనికి బోట్ యాక్సిడెంట్ జరగడం.. కూతురు చనిపోవడం.. వంటి ఘటనలు చూస్తే ఎలాంటివారికైనా బాధ కలగకమానదు. ఈ నేపథ్యంలోనే.. "స్ట్రే స్ట్రాంగ్ విజయ్ సార్" అంటూ విజయ్ ఆంటోని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
Also Read