
తెలుగు వెండితెరపై హాస్యానికి కొత్త అర్థం చెప్పిన అద్భుతమైన కాంబినేషన్ కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao), బాబు మోహన్ (Babu Mohan). వీరిద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ప్రేక్షకులు నవ్వులతో పొట్ట చెక్కలు చేసుకోవాల్సిందే. 90వ దశకంలో ఈ కాంబినేషన్ ఒక ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా బాబు మోహన్ అమాయకత్వం, కోట వెటకారం కలగలిసి పండించే హాస్యం తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఒక అద్భుత హాస్య ప్రయాణం
కోట శ్రీనివాసరావు తన విలక్షణమైన డైలాగ్ డెలివరీతో, బాడీ లాంగ్వేజ్‌తో నవ్విస్తే.. బాబు మోహన్ తన మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్‌తో దానికి అదనపు బలాన్ని చేకూర్చేవారు. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ఏ స్థాయిదంటే, ఒకరు డైలాగ్ మొదలుపెడితే మరొకరు దానికి వెంటనే కౌంటర్ ఇచ్చేవారు. వీరిద్దరి కలయికలో వచ్చిన 'స్నేహం కోసం', 'అబ్బాయిగారు', 'వైఫ్' వంటి సినిమాలు ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటాయి.
'స్నేహం కోసం', 'అబ్బాయిగారు', 'వైఫ్' సినిమాల్లో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబో బెస్ట్ కామెడీ సీన్స్ తాజాగా 'తెలుగువన్' యూట్యూబ్ ఛానల్ లో విడుదలయ్యాయి. ఈ వీడియోలో వీరిద్దరి ఆల్ టైమ్ హిట్ కామెడీ సీన్లను మనం చూడవచ్చు. ముఖ్యంగా 'అబ్బాయిగారు', 'స్నేహం కోసం' చిత్రాలలోని సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి.
అబ్బాయిగారు కామెడీ:
బాబు మోహన్ తెల్లటి సూటు వేసుకుని, నోట్లో సిగార్ పెట్టుకొని 'బుష్' అంటూ ఒక రిచ్ మ్యాన్ లా ఫోజులు కొడతాడు. లంకంత కొంపను పట్టుకొని, పాక అనడమే కాకుండా.. ఇలాంటి పాకలో మా పనివాళ్ళు ఉంటారంటూ బిల్డప్ ఇస్తాడు. ఆ సమయంలో కోట ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్, కౌంటర్స్ భలే ఉంటాయి.
ఆ తర్వాత కొబ్బరి తోటలో కోట శ్రీనివాసరావు పని చేస్తుండగా.. ముష్టివాడి గెటప్ లో బాబు మోహన్ ఎంట్రీ ఇచ్చి షాకిస్తాడు. తాను బుష్ కాదని, తనకు ఆస్తులు లేవని, గుడి దగ్గర ముష్టి వాడినని చెప్తాడు. అప్పుడు "నీ ముష్టి చిప్పలో నా కొబ్బరి చిప్ప" అంటూ కోట చెప్పే డైలాగ్ భలే ఫన్నీగా ఉంటుంది.
స్నేహం కోసం కామెడీ:
ఇక స్నేహం కోసం సినిమాలో బాబు మోహన్ తాను వెర్రివాడిగా కనిపిస్తూ, అందరినీ వెర్రివాళ్ళని చేసే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. కారుకి ఎనిమిది టైర్లు ఉన్నాయంటూ.. నాలుగు వైపులా రెండు చొప్పున లెక్క పెట్టడం ఇప్పటికీ నవ్వు తెప్పిస్తుంది. ఇక కోట 500 రూపాయలు ఇచ్చి ఇడ్లీ తెమ్మంటే.. ఒక మూట నిండా బాబు మోహన్ ఇడ్లీలు తీసుకురావడం హైలైట్ సీన్. అలాగే కొండను మోస్తానని బాబు మోహన్ ఊరి మొత్తాన్ని నమ్మించడం వేరే లెవెల్.
నేటి కాలంలో ఎన్ని కామెడీ షోలు వచ్చినా, కోట-బాబు మోహన్ కాంబినేషన్ అందించిన స్వచ్ఛమైన హాస్యం ఎప్పటికీ ప్రత్యేకం. వీరి కామెడీ కేవలం డైలాగుల మీద మాత్రమే కాకుండా, ముఖ కవళికల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే దశాబ్దాలు గడిచినా వీరి కామెడీ సీన్లు నేటి తరానికి కూడా ఎంతో వినోదాన్ని పంచుతున్నాయి.
ఇలాంటి మరిన్ని అద్భుతమైన సన్నివేశాలు, సినిమాల కోసం మా 'తెలుగువన్' (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.





