Home

»

Latest News

హాస్పిటల్ పాలైన అవికా గోర్... ఇచ్చిన మాట తప్పిందా!

Aug 8, 2026 2:32PM

 

 

కింగ్ నాగార్జున(Nagarjuna)నిర్మించిన ఉయ్యాల జంపాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన భామ అవికా గౌర్. పలు హిందీ తెలుగు చిత్రాలు చేసుకుంటూ దూసుకుపోతన్న అవికా గోర్ ప్రస్తుతం అనారోగ్యంతో ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడం సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దాదాపు ఐదు రోజులుగా 103 నుంచి 104 డిగ్రీల తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, ఆమె తన వృత్తిపట్ల అంకితభావాన్ని ప్రదర్శిస్తూ షూటింగ్స్‌లో పాల్గొనడం విశేషం. ఈ విషయాలను ఆమె భర్త మిలింద్ చంద్వానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. 


సాధారణంగా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే విశ్రాంతి తీసుకుంటారు, కానీ అవికా మాత్రం తాను ఇచ్చిన మాట కోసం ప్రాణాలని  సైతం లెక్కచేయకుండా షూట్ లోపాల్గొంది.  దాదాపు ఐదు రోజుల పాటు 104 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ,  మొదట ఒక ప్రాజెక్ట్‌కి సంబంధించిన పెండింగ్ షూటింగ్‌ను కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేసింది. ఆ తర్వాత రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని భావించినా, మరుసటి రోజు ఒక యాడ్ షూట్ కోసం తీవ్రమైన జ్వరంతోనే ఢిల్లీకి ప్రయాణించారు. సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉన్నప్పటికీ, కేవలం ఓఆర్ఎస్ (ORS) తాగుతూ షూటింగ్‌ లో పాల్గొంది. షూటింగ్ వాయిదా పడితే నిర్మాతలు లేదా తోటి నటీనటుల సమయం, డబ్బు వృథా అవుతాయని, ఎవరికీ నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఈ సాహసం చేశారని మిలింద్ పేర్కొన్నారు.  

Also read: కలెక్షన్స్ లో తోపు ఎవరు: #స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే vs ది ఒడిస్సీ 


అయితే ముంబైకి తిరిగొచ్చాక ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా  డెంగ్యూ పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, ఆమె నటించిన సరికొత్త మ్యూజిక్ ఆల్బమ్ 'బుఖార్' (అంటే హిందీలో జ్వరం) విడుదలైన రోజే ఆమె  జ్వరంతో ఆసుపత్రిపాలు కావడం గమనార్హం.


Avika Gor, Milind Chandwani, Tolywood, Nagarjuna

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com