
రీసెంట్ గా అషు రెడ్డి (Ashu Reddy) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు చూసి చాలామంది అషుకి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది అనుకున్నారు. ఓ వైపు పెళ్ళి పేరుతో రూ.9 కోట్లకు పైగా మోసం చేసిందంటూ అషుపై ఆరోపణలు వస్తుండగా.. ఇలా ఆమె ఎంగేజ్‌మెంట్ ఫోటోలు షేర్ చేయడం చాలామందిని షాక్ కి గురిచేసింది. అయితే ఈ విషయంపై అషు తాజాగా క్లారిటీ ఇచ్చింది.
అషు రెడ్డికి ఎంగేజ్‌మెంట్ జరగలేదు. జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అనే వెబ్ సిరీస్ లో.. ఎంగేజ్‌మెంట్ సీన్ షూటింగ్ సందర్భంగా తీసుకున్న ఫోటోలు అవి. ఈ విషయాన్ని రివీల్ చేస్తూ తాజాగా అషు ఒక వీడియోతో పాటు, కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
అంతేకాదు, ఇలా తాను ఎందుకు ప్రాంక్ చేశానో కూడా చెప్పుకొచ్చింది. "మనం కళ్ళతో చూసేది లేదా చెవులతో వినేది ఎల్లప్పుడూ నిజం కాకపోవచ్చు. నిజమనిపించే ప్రతీదీ నిజం కాదు… నమ్మే ముందు ఆలోచించండి." అని అషు రాసుకొచ్చింది.
తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలపడం కోసం అషు రెడ్డి ఈ పోస్ట్ లు చేసిందని అర్థమవుతోంది.





