Home

»

Latest News

Peddi: టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఏపీలో 'పెద్ది' టికెట్ ధరలు ఇవే!

May 29, 2026 9:10AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'పెద్ది' (Peddi) విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే చిత్ర బృందం దేశవ్యాప్తంగా వినూత్న ప్రమోషన్లతో హోరెత్తిస్తోంది.

ఈ క్రమంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయా అని ఇరు తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'పెద్ది' చిత్రానికి భారీ ఊరటనిస్తూ కీలక జీవోను విడుదల చేసింది. సినిమా టికెట్ల ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోలకు అనుమతి ఇస్తూ ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, 'పెద్ది' సినిమా విడుదలకు ఒక రోజు ముందే అంటే జూన్ 3న రాత్రి 8 గంటల నుంచి ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రదర్శించుకునేందుకు అధికారికంగా అనుమతి లభించింది. ఈ ప్రత్యేక ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను జీఎస్టీతో కలిపి గరిష్టంగా రూ. 600గా నిర్ణయించారు. 

అంతేకాకుండా, జూన్ 4న నుంచి 10 రోజుల పాటు అదనపు ప్రదర్శనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో ప్రతిరోజూ ఐదు షోలు (5 Shows) ప్రదర్శించుకోవడానికి వీలుగా సర్కార్ వెసులుబాటు కల్పించింది.

టికెట్ ధరల పెంపు విషయానికి వస్తే, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న సాధారణ టికెట్ ధరలపై అదనంగా రూ. 100 వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా రూ. 125 చొప్పున పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఈ పెంచిన టికెట్ ధరలు జూన్ 4 నుంచి ప్రారంభమై మొదటి 10 రోజుల పాటు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ భారీ వెసులుబాటు 'పెద్ది' మూవీ బాక్సాఫీస్ వసూళ్లకు తొలి వారంలోనే భారీగా కలిసిరానుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com