Home

»

Latest News

Allu Arjun: హెచ్‌పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ కు మద్దతుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్!

Apr 01, 2026

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) హెచ్‌పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ కు మద్ధతుగా నిలిచేందుకు ముందుకొచ్చింది. AAFA ఈ ఏడాది మొత్తం ప్రజల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలు చేయనుంది. ఏడాదికో మంచి పని చేయాలంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని AAFA ఈ ఇనిషియేటివ్ తీసుకుంది. 

హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మన ఆడ బిడ్డలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. 9 నుంచి 26 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలు ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా తీసుకోవచ్చు. 

కేంద్రప్రభుత్వం స్వస్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బాలికలకు, మహిళలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందిస్తోంది. ఈనెల 8వ తేదీన  అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి సామాజిక కార్యక్రమానికి ఫ్యాన్స్ అసోసియేషన్ ముందుకురావడం అభినందనీయం.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com