akhanda 2 : ఈ రోజు ఈవినింగ్ షోస్ నుంచి బుకింగ్స్ ఓపెన్
on Dec 5, 2025

-బుకింగ్స్ ఓపెన్
-అభిమానుల కోలాహలం
-డిటైల్స్ ఇవే
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)వన్ మాన్ షో ' అఖండ 2'(Akhanda 2)సంక్రాంతికి వాయిదా పడబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్న వేళ అభిమానులకి ఒక గుడ్ న్యూస్. బుక్ మై షో లో అఖండ 2 కి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో జోష్ వచ్చింది. బుక్ మై షో(Book My show)తన సైట్ లో ఉంచిన షో వివరాలు ఇవే.
ఏపి లోని వైజాగ్(Vizag)లో ఈ రోజు ఈవెనింగ్ ఆరుగంటల షో నుంచే టికెట్స్ ని అందుబాటులో ఉంచింది. విజయవాడ(Vijayawada)లాంటి చోట్ల రేపటికి బుకింగ్స్ ని ఓపెన్ చేసారు. కాకపోతే మిగతా ఏరియాల్లో ఇంకా ఓపెన్ కాలేదు. హైదరాబాద్(Hyderabad)తో పాటు తెలంగాణ(Telangana)ఏరియా బుకింగ్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. సదరు బుకింగ్స్ ఓపెన్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
also read: మహేష్ బాబు ప్రమేయం లేదు..పూర్తి వివరణ ఇదే
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



