Home

»

Latest News

అల్లు అర్జున్ స్టైల్ కి ఫిదా అయిన హీరోయిన్

Aug 23, 2023

పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌ ఇప్పుడు పుష్ప 2 ది రూల్‌తో మరో స్టెప్‌ ఎదుగున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ మరింత పెంచుతోంది. అంతేకాదు అల్లు అర్జున్‌కి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా బాగా పెరిగింది. సెలబ్రిటీస్‌ కూడా అతనికి ఫ్యాన్స్‌ బాగా ఉన్నారు. ముఖ్యంగా లేడీ సెలబ్రిటీస్‌ బన్నిని ఎంతో ఇష్టపడుతున్నారు. ఈ విషయం గతంలో కూడా ప్రూవ్‌ అయింది.

తాజాగా దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న కింగ్‌ ఆఫ్‌ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్య లక్ష్మి కూడా ఇప్పుడు బన్ని ఫ్యాన్స్‌ లిస్ట్‌లో చేరింది. కింగ్‌ కొత్త సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్‌ గురించి వ్యాఖ్యానించింది. బన్ని అంటే తనకెంతో ఇష్టమని, అతని స్టైల్‌ తనకు బాగా నచ్చుతుందని, ఇతర హీరోలతో పోలిస్తే అతను చాలా డిఫరెంట్‌గా ఉంటాడని చెబుతోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com